railway - People's Diary https://peoplesdairy.in Telugu National Daily Mon, 04 Nov 2024 09:47:28 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7 https://peoplesdairy.in/wp-content/uploads/2024/09/cropped-LOGOB-32x32.png railway - People's Diary https://peoplesdairy.in 32 32 రైల్వేశాఖ సూపర్‌ న్యూస్‌! https://peoplesdairy.in/2024/11/04/railway-super-news/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=railway-super-news https://peoplesdairy.in/2024/11/04/railway-super-news/#respond Mon, 04 Nov 2024 09:47:28 +0000 https://peoplesdairy.in/?p=1258 ఒకే యాప్‌లో అన్ని సౌకర్యాలు డిసెంబర్‌లో అందుబాటులోకి వచ్చే ఛాన్స్‌ పీపుల్స్‌డైరీ`న్యూఢల్లీి : భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వేకు సంబంధించిన అన్ని రకాల సేవలను ఒకే చోట అందించేందుకు ఓ సూపర్‌ యాప్‌ తీసుకొస్తూ అదిరే శుభవార్త చెప్పింది.…

The post రైల్వేశాఖ సూపర్‌ న్యూస్‌! first appeared on People's Diary.

]]>
  • ఒకే యాప్‌లో అన్ని సౌకర్యాలు
  • డిసెంబర్‌లో అందుబాటులోకి వచ్చే ఛాన్స్‌
  • పీపుల్స్‌డైరీ`న్యూఢల్లీి : భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వేకు సంబంధించిన అన్ని రకాల సేవలను ఒకే చోట అందించేందుకు ఓ సూపర్‌ యాప్‌ తీసుకొస్తూ అదిరే శుభవార్త చెప్పింది. ఈ సూపర్‌ యాప్‌ త్వరలోనే అందుబాటులోకి రానుంది. డిసెంబర్‌ చివరి నాటికి ఈ సూపర్‌ యాప్‌ లాంచ్‌ చేసేందుకు భారతీయ రైల్వే సన్నాహాలు చేస్తున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం రైల్వేకు సంబంధించిన సేవలు పొందేందుకు ప్రయాణికులు వేరు వేరు వెబ్‌సైట్లు, యాప్స్‌ ఉపయోగించాల్సి వస్తోంది. ఉదాహరణకు ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌ కోసం ఐఆర్‌సీటీసీ రైల్‌ కనెక్ట్‌, అన్‌ రిజర్వ్‌డ్‌ టికెట్లకు యూటీఎస్‌ యాప్‌, ఫుడ్‌ ఆర్డర్‌ చేసేందుకు ఐఆర్‌సీటీసీ ఈ కేటరింగ్‌ ఫుడ్‌ ఆన్‌ ట్రాక్‌, కంప్లెయింట్స్‌ చేసేందుకు, ఫీడ్‌ బ్యాక్‌ నమోదుకు రైల్‌ మదద్‌ వంటి యాప్స్‌ వాడాల్సి వస్తోంది. అలాగే నేషనల్‌ ట్రైన్‌ ఎంక్వైరీ సిస్టమ్‌ ద్వారా ట్రైన్‌ ట్రాకింగ్‌ చేయాల్సి వస్తోంది. ఒక్కో సర్వీసు కోసం ఒక్కో యాప్‌, వెబ్‌సైట్‌ వాడాల్సి వస్తోంది. దీంతో చాలా మంది ఏది దేనికోసమో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఈ సేవలన్నింటినీ సూపర్‌ యాప్‌ ద్వారా ఒకేచోట అందించనుంది. ఈ సూపర్‌ యాప్‌ను సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ అభివృద్ధి చేస్తున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. ఇప్పటికే యాప్‌ సిద్ధమైందని, దానిని ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌తో అనుసంధానం చేసే ప్రక్రియ కొనసాగుతోందని ఓ ఉన్నతాధికారి చెప్పినట్లు జాతీయ మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. ఈ సూపర్‌ యాప్‌ గనక అందుబాటులోకి వచ్చినట్లయితే ట్రైన్‌ టికెట్‌ బుకింగ్‌ సహా ప్లాట్‌ ఫామ్‌ టికెట్‌, అన్‌ రిజర్వ్డ్‌ టికెట్ల అన్నింటినీ ఒకే చోట బుక్‌ చేసుకోవచ్చు. తాము ప్రయాణించాల్సిన ట్రైన్‌ రన్నింగ్‌ స్టేటస్‌ సైతం ఈజీగా ట్రాక్‌ చేయవచ్చు. ప్రస్తుతం ఈ సేవలన్నీ ఒకే చోట పొందేందుకు చాలా మంది రైల్వే ప్రయాణికులు థర్డ్‌ పార్టీ యాప్స్‌పై ఆధారపడుతున్నారు. ఈ సూపర్‌ యాప్‌ అందుబాటులోకి వస్తే తరుచూ రైల్వే ప్రయాణం చేసే వారికి ఎంతగానో ఉపయోగకరంగా ఉండనుంది.

    The post రైల్వేశాఖ సూపర్‌ న్యూస్‌! first appeared on People's Diary.

    ]]>
    https://peoplesdairy.in/2024/11/04/railway-super-news/feed/ 0
    రైల్వే నియామకాల నిబంధనలపై యూటర్న్ https://peoplesdairy.in/2024/10/07/uturn-on-rules-of-railway-appointments/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=uturn-on-rules-of-railway-appointments https://peoplesdairy.in/2024/10/07/uturn-on-rules-of-railway-appointments/#respond Mon, 07 Oct 2024 07:13:59 +0000 https://peoplesdairy.in/?p=1085 రైల్వే నియామకాల నిబంధనలపై యూటర్న్ 2019 ఎన్నికలకు ముందు కేంద్రం తీసుకున్న పలు నిర్ణయాలు ఆ తర్వాత ఐదేళ్లలో తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో ఇప్పుడు మరోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే సర్కార్ ఒక్కొక్కటిగా వాటిపై సమీక్ష చేస్తోంది. ఇందులో భాగంగా…

    The post రైల్వే నియామకాల నిబంధనలపై యూటర్న్ first appeared on People's Diary.

    ]]>
    రైల్వే నియామకాల నిబంధనలపై యూటర్న్

    2019 ఎన్నికలకు ముందు కేంద్రం తీసుకున్న పలు నిర్ణయాలు ఆ తర్వాత ఐదేళ్లలో తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో ఇప్పుడు మరోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే సర్కార్ ఒక్కొక్కటిగా వాటిపై సమీక్ష చేస్తోంది. ఇందులో భాగంగా 2019 సమయంలో అమల్లోకి తెచ్చిన రైల్వే అధికారుల నియామకాల నిబంధనలపై యూటర్న్ తీసుకుంది. వీటి స్ధానంలో తిరిగి పాత విధానాన్నే అమలు చేయాలని రైల్వే బోర్డు తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇండియన్ రైల్వే మేనేజ్ మెంట్ సర్వీస్ కింద ఉన్నతాధికారులు, సాంకేతిక నిపుణుల నియామకం కోసం యూపీఎస్సీ రెండు పరీక్షలు నిర్వహిస్తుంది. వీటిలో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్ఈ) ఒకటి కాగా.. ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (ఈఎస్ఈ) రెండవది. అయితే 2019లో ఇంజనీరింగ్ పరీక్షను తొలగించి కేవలం సీఎస్ఈ రాస్తే సరిపోతుందని నిబంధనలు సవరించింది. కొత్త విధానంలో రెండు రిక్రూట్ మెంట్లు కూడా నిర్వహించింది. అయితే ఇప్పటివరకూ వారికి పోస్టింగ్ లు ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి తోడు ఏడాదికి ఐఆర్ఎంస్ కింద 150 మందినే తీసుకోవాలన్న మరో నిర్ణయం ప్రభావం రైల్వేలపై తీవ్రంగా పడింది. రైల్వేలో ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ వంటి సాంకేతిక విభాగాల్లో అధికారుల కొరత ఏర్పడింది. దీంతో జూనియర్లనే ఈ పోస్టులకు ప్రమోట్ చేయడం లేదా సబార్డినేట్ ర్యాంక్ అధికారుల ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రైల్వే బోర్డు ఛైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించిన సతీష్ కుమార్ వచ్చీ రాగానే వీటిపై దృష్టిసారించారు. పాత నిర్ణయాల్ని వెనక్కి తీసుకున్నారు. దీంతో మళ్లీ యథావిథిగా రిక్రూట్ మెంట్లు జరగబోతున్నాయి. కేంద్రం యూటర్న్ తర్వాత సివిల్ ఇంజినీరింగ్ (75), మెకానికల్ ఇంజినీరింగ్ (40), ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ (50), సిగ్నల్ & టెలికమ్యూనికేషన్స్ (40), స్టోర్స్ (20) కేటగిరీల కింద 225 పోస్టులను ఐఆర్‌ఎంఎస్ కింద భర్తీ చేయాల్సి ఉంటుందని ఈ రిక్రూట్ మెంట్ కు నోడల్ ఏజెన్సీగా ఉన్న కేంద్రం టెలికాం శాఖ యూపీఎస్సీకి సమాచారం ఇచ్చింది.

    The post రైల్వే నియామకాల నిబంధనలపై యూటర్న్ first appeared on People's Diary.

    ]]>
    https://peoplesdairy.in/2024/10/07/uturn-on-rules-of-railway-appointments/feed/ 0