సామాజిక సర్వేలో ప్రతి ఇల్లు సర్వే చేయాలి
— జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి, అక్టోబర్ 27 ( పీపుల్స్ డైరీ ) : త్వరలో చేపట్టనున్న సామాజిక ఆర్ధిక సర్వేలో ప్రతి ఇల్లు సర్వే చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఆదివారం సామాజిక ఆర్ధిక సర్వే ప్రక్రియపై రెవెన్యూ, పంచాయతి రాజ్, సంక్షేమ, ప్రణాళిక, డిఆర్డీఓ, మున్సిపల్ శాఖల అధికారులతో టెలి కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… సర్వే ప్రక్రియ నిర్వహణకు 933 ఎన్యూమరేటర్లు అవసరం ఉన్నదని తెలిపారు. 10 మంది ఎన్యూమరేటర్లుకు పర్యవేక్షణకు ఒక మండల స్థాయి అధికారిని పర్యవేక్షణ అధికారిగా నియమించనున్నట్లు తెలిపారు. పంచాయతి కార్యదర్శలు, అంగన్ వాడి సిబ్బంది, డిఆర్డీఏ సిబ్బంది ఎన్యూమరేటర్లు గా నియమించనున్నట్లు తెలిపారు. జిల్లాస్థాయిలో నిర్వహించే శిక్షణా కార్యక్రమంలో ట్రైనర్లు పాల్గొని తదుపరి మండలస్థాయిలో సర్వే టీములకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సర్వే ప్రక్రియ పర్యవేక్షణ చేయాలని తెలిపారు. సోమవారం ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్లుకు నియామకపు ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిపారు. ప్రతి రోజు సర్వే వివరాలను డేటా ఎంట్రీ పూర్తి చేయాలని తెలిపారు. ఎలాంటి తప్పులకు తావు లేకుండా డేటా ఎంట్రీ చేసేందుకు సిబ్బందిని నియమించి శిక్షణ ఇవ్వాలని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో సిబ్బంది ని ఎంపిక చేయాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. ఈ టెలి కాన్ఫెరెన్స్ లో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, సిపిఓ నారాయణ రావు, డిఆర్డీఓ అవినాష్, సిపిఓ బాబురావు, సంక్షేమ అధికారి చిన్నయ్య, ఆర్డిఓ మంగిలాల్, అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓ లు తదితరులు పాల్గొన్నారు.