ఏఈఓల సమస్యలు పరిష్కరించాలి
- ప్రభుత్వం ఎఈఓలను తొలగించే కుట్ర చేస్తుంది…!
- డీఎస్సీ (డిజిటల్ క్రాప్ సర్వే) పేరుతో ఎఈఓలు ఇబ్బందులకు గురవుతున్నారు
- మాజీ పిఎసిఎస్ ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి
గణపురం: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎఈఓల సమస్యలను పరిష్కరించాలని , డిఎస్సీ (డిజిటల్ క్రాప్ సర్వే) పేరుతో ఎఈఓ లు అనేక ఇబ్బందులు పడుతున్నారని జయశంకర్ భూపాలపల్లి గండ్ర యువసేన జిల్లా అధ్యక్షులు, మాజీ పిఎసిఎస్ ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం ఎఈల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, ఇప్పటికే 49 రకాల పనులు చేస్తూ ఎఈ (వ్యవసాయ విస్తరణ అధికారి) లు రైతులకు అందుబాటులొ ఉంటున్నారని, రాష్ర్ట ప్రభుత్వం డిఎస్సీ పని చేయాలని ఒత్తిడి చేస్తూ , సాకులతో సుమారు 160 మంది AEO లను సస్పెండ్ చేయడం మంచిపరిణామం కాదని, ఎఈ లలో చాలా మంది మహిళలు ఉన్నారని కనీసం వారిపట్ల కూడా సానుకూల దృక్పథం లేకపోవడం బాధాకరమని అన్నారు.
రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న 15000000 (ఒక కోటి యాభై లక్షల) ఎకరాల్లో సాగువిస్తీర్ణం ఉందని, కేవలం 2604 మంది ఎఈ లు మాత్రమే ఉన్నారని, ఒక్కో ఎఈ కు 5 నుండి 8000 ఎకరాల చొప్పున పని ఉందని, అయినప్పటికీ పంట వివరాలు నమోదు, రైతు బంధు, రైతు భీమా, పీఎం కిసాన్, ధాన్యం కొనుగోలు సరఫరా, తదితర పనుల్లో చురుగ్గా పనిచేస్తున్నారు….
కానీ రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి (డిజిటల్ క్రాప్ సర్వే) పేరుతో ఎఈ లను ఇబ్బందులకు గురిచేస్తుందని, ఇప్పటికైనా వారి పట్ల కనికరించి సస్పెండ్ చేసిన 160 మందిని విధుల్లోకి తీసుకొని , ఉద్యోగ భద్రత కల్పించాలని, దీనిపై వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు ఏఈ లకు సహకరించాలని పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు.
డీఎస్సీ (డిజిటల్ క్రాప్ సర్వే) కు గ్రామాల్లో చదువుకున్న నిరుద్యోగ యువతకు అవకాశం కల్పించాలని కోరారు.
డీఎస్సీ (డిజిటల్ క్రాప్ సర్వే) కేంద్ర నిర్ణయం…
అసలు అనేది కేంద్ర ప్రభుత్వ నిర్ణయమని పంటల ఇన్స్యూరెన్స్ , విపత్తు సమయంలో పంట నష్టంపై అంచనా, పంటల ఎగుమతి , దిగుమతి, మార్కెటింగ్ , తదితర అంశాలపై ఉపయోగపడేలా ఈ సర్వే స్కీం తీసుకువచ్చారు. కానీ దానిపట్ల రాష్ర్ట ప్రభుత్వం విధివిధానాలు సరిగా లేవని పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో మరియు కర్ణాటక, తమిళనాడు, ఒడిసా రాష్ట్రాలలో రెవెన్యూ సిబ్బంది, గ్రామ సహాయకులు, నిరుద్యోగ యువత సహకారంతో , ప్రవేట్ ఏజెన్సీ లతో సర్వే అమలు చేస్తున్నారని , కేవలం మన రాష్ట్రంలో ఎఈలను ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురుచేస్తుందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వారి సమస్యలపై స్పందించి, సానుకూల నిర్ణయం తీసుకోవాలని పూర్ణచంద్రారెడ్డి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.