10 మంది పోలీసుల తొలగింపు

10 మంది పోలీసుల తొలగింపు

  • తెలంగాణ పోలీస్‌ శాఖ మరో సంచలన నిర్ణయం
  • కొనసాగుతున్న ఆదోళనలు

పీపుల్స్‌డైరీ`హైదరాబాద్‌ : తమ డిమాండ్లు నెరవేర్చాలని ఆందోళనలు చేస్తోన్న తెలంగాణ స్పెషల్‌ పోలీస్‌ సిబ్బందిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. శనివారం 39 మందిని కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేసిన పోలీసు శాఖ.. తాజాగా 10 మందిని డిస్మిస్‌ చేసింది. వారిని శాశ్వతంగా విధుల నుంచి తొలగిస్తూ.. ఏడీజీ సంజయ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఒకే రాష్ట్రం- ఒకే పోలీస్‌ విధానం అమలు చేయాలంటూ గతకొద్ది రోజులుగా కానిస్టేబుళ్లు, వారి భార్యలు రోడ్డెక్కి ధర్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే. పది మంది టీజీఎస్పీ పోలీసులపై వేటు వేసింది. వారిని డిస్మిస్‌ చేస్తూ ఆదివారం (అక్టోబర్‌ 27) రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసుశాఖలో పని చేస్తూ.. క్రమశిక్షణ ఉల్లంఘించి ఆందోళన నిర్వహించేందుకు కారణమైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంది. ఆర్టికల్‌ 311(2)బీ ప్రకారం వారిని శాశ్వతంగా విధుల నుంచి తొలగించినట్లు తెలిపింది. ఇందులో ఓ ఎస్సై స్థాయి అధికారి కూడా ఉన్నారు. ఇక సివిల్‌ పోలీసులతో సమానంగా తమకూ డ్యూటీలు వేయాలని.. పొరుగు రాష్ట్రాల్లో ఉన్న విధంగా ‘ఒకే రాష్ట్రం ఒకే పోలీసు విధానం’ అమలు చేయాలన్న డిమాండ్‌తో స్పెషల్‌ కానిస్టేబుళ్లు చేస్తున్న ఆందోళను కొనసాగుతూనే ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *