పొగరు తగ్గట్లే..
- ‘పీపుల్స్‌డైరీ’పై శివాలెత్తిన క్యాంప్ క్లర్!?
- నాపై ఎంక్వైరీ చేసి వార్తలు రాసే దమ్ముందా అంటూ గుర్రు
- ఎవరేం చేస్తారో చూస్తానంటూ బిల్డప్
- బయటకొస్తున్న మరిన్ని వివాదాలు…
- ఓ ఉద్యోగికి వత్తాసు పలికినందుకు కాళ్ళు పట్టించుకున్న సీసీ
- డ్రైవర్ అంతు చూస్తానంటూ బెదిరింపులు
- అధికారులతో మాట్లాడి విధులు చేయకుండా పక్కన పెట్టిన వైనం
- ‘పీపుల్స్‌డైరీ’ వరుస కథనాలతో బెంబేలెత్తుతున్న క్యాంప్ క్లర్క్
పీపుల్స్ డైరీ ప్రతినిధి, వరంగల్
గ్రేటర్ వరంగల్ బల్దియాలో ఓ ప్రజాప్రతినిధి వద్ద విధులు నిర్వహించే క్యాంప్ క్లర్క్‌పై ‘పీపుల్స్‌డైరీ’ పత్రికలో వచ్చిన కథనాలతో శివాలెత్తుతున్నట్టు తెలిసింది. నాపైనే ఎంక్వైరీ చేసి వార్తలు రాసే దమ్ముందా? అంటూ తన అనుచరుల వద్ద రెచ్చిపోతున్నట్టు సమాచారం. ఎన్ని వార్తలు రాసినా నన్ను ఎవరూ ఏం చేయలేరంటూ డాంబికం ప్రదర్శిస్తున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో ‘పీపుల్స్‌డైరీ’ పత్రిక అతడి ఆగడాలపై మరిన్ని వివరాలు సేకరించే పనిలో పడిరది. అయితే గ్రేటర్ వరంగల్‌లో ఓ ప్రజాప్రతినిధి వద్ద విధులు నిర్వహించే క్యాంప్ క్లర్క్ (సీసీ) బల్దియాలో అన్నీ తానై చక్రం తిప్పుతున్నాడనే విషయాన్ని ‘పీపుల్స్‌డైరీ’ పత్రికలో ఇటీవల కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. అతడి ఆగడాలకు ఎందరో ఇబ్బంది పడుతున్న విషయాన్ని వెలుగులోకి తేవడం జరిగింది. ఇతడి వేధింపులతో ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ డ్రైవర్ తరుపున మాట్లాడినందుకు మరో సిబ్బందిని కాళ్ళు మొక్కించుకున్నట్టు తెలిసింది. అమాయక ఉద్యోగుల వేతనాలు ఆపడంలో ఇతగాడు దిట్ట. ఎవడే చేస్తాడో చూద్దాం అని బిల్డప్‌లు ప్రదర్శిస్తున్న ఇతగాడి దమ్మెంటో… క్యాంప్ క్లర్క్ వెనక ఉన్న ధైర్యం ఏంటో వేచి చూద్దాం.