‘కంగువ’ ఎడిటర్ నిషాద్ యూసఫ్ అనుమానాస్పద మృతి
పీపుల్స్‌డైరీ`సినీ డెస్క్ : తమిళ స్టార్ హీరో సూర్య నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘కంగువ’ నవంబర్ 14న ఈ సినిమా రిలీజ్ అవుతున్న వేళ మూవీ టీమ్ మొత్తం ప్రమోషన్స్‌లో మునిగిపోయింది. ఇలాంటి సమయంలో కంగువ టీమ్‌కి అనుకోని షాక్ తగిలింది. ఈ సినిమాకి ఎడిటర్‌గా పని చేసిన నిషాద్ యూసఫ్ (43) తాజాగా కన్నుమూశారు. అనుమానాస్పద రీతిలో తన అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించారు నిషాద్. ఈ విషయం అందరినీ షాక్‌కి గురి చేస్తుంది. కేరళ కొచ్చిలోని తన అపార్ట్‌మెంట్‌లో నిషాద్ మృతి చెందారు. బుధవారం వేకువజామున 2 గంటలకి నిషాద్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అయితే నిషాద్ మృతి అనుమానాస్పదంగా ఉందని.. కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు వెల్లడిరచారు. కానీ ఇది సూసైడ్ అనే అనుమానాలు ఉన్నట్లు పోలీసులు అంటున్నారు. ఇక నిషాద్‌కి పెళ్లి అయి ఒక పాప ఉంది. నిషాద్ మృతి పట్ల అటు మాలీవుడ్ ఇటు కోలీవుడ్ సెలబ్రెటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఇక తన పనికి గాను ఎన్నో అవార్డులు కూడా నిషాద్ దక్కించుకున్నారు. 2022లో కేరళ స్టేట్ ఫిలిమ్ అవార్డును నిషాద్ అందుకున్నారు. తల్లుమలా చిత్రానికి గాను బెస్ట్ ఎడిటర్ అవార్డు నిషాద్ యూసఫ్‌కి దక్కింది.