వరంగల్‌లో ప్రమాద ఘంటికలు!
- హైదరాబాద్‌ను మించి గాలి కాలుష్యం
- రాష్ట్రంలోని మరో 23 జిల్లాల్లోనూ దారుణ పరిస్థితి
పీపుల్స్‌డైరీ`హైదరాబాద్ : ఢల్లీిలో నెలకొన్న ప్రమాద వాతావరణ పరిస్థితులే త్వరలో తెలంగాణలో ఉండనున్నాయా అంటే ఔననే సమాధానమే విన్పిస్తోంది. తెలంగాణ విషయానికొస్తే ఇక్కడ కూడా పలు జిల్లాల్లో గాలి కాలుష్యం పెరుగుతోంది. ఎయిర్ క్వాలిటీ తగ్గుతోంది. రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రధాన ప్రాంతాల్లో గాలి కాలుష్యం పెరుగుతోంది. పట్టణ ప్రాంతాల్లో వాహనాలు, నిర్మాణాలు, పరిశ్రమలు పెరుగుతోన్నాయి. దీంతో ఆ ప్రాంతాల్లో గాలి నాణ్యత తగ్గుతోంది. ఫలితంగా గాలిలో కాలుష్య కారకాలైన పార్టిక్యులేట్ మ్యాటర్ (పీఎం) 2.5 కు పెరిగుతోంది. తెలంగాణలోని 23 జిల్లాల్లో గాలి నాణ్యత సూచిక (AూI) వందకు పైగానే ఉంటుంది. వరంగల్, హనుమకొండలో హైదరాబాద్‌కు మించి ఏక్యూఐ వస్తుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వరంగల్ నగరంలో అత్యధికంగా ఏక్యూఐ 143 నమోదు అయింది. పీఎం 2.5 స్థాయిలో క్యూబిక్ మీటర్ గాలిలో 59 మైక్రోగ్రాముల మేర ఉన్నట్టు చెబుతున్నారు. ఏడాదిలో ఏక్యూఐ యవరేజ్ గా 120గా ఉంది. అయితే దాదాపు 180 రోజుల పాటు అదే స్థాయిలో లెక్కలు ఉండడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. రాష్ట్రంలో హైదరాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనూ ఏక్యూఐ 110 కన్నా ఎక్కువగానే నమోదు అవుతుందని లెక్కలు చెబుతున్నాయి. భాగ్యనగరంలో ఏక్యూఐ 128 నమోదు అవుతుంది.