కొత్త రైల్వే మార్గాలకు అడుగులు

  • కరీంనగర్‌-హసన్‌పర్తి డీపీఆర్‌ రెడీ
  • డోర్నకల్‌`మిర్యాలగూడ మార్గానికి కూడా…
  • సికింద్రాబాద్‌- వాడి మధ్య మేర ఫోర్‌ లైన్‌ రైల్వే విస్తరణ
  • మొత్తం వ్యయం రూ.7,840.37 కోట్లు

పీపుల్స్‌డైరీ`సికింద్రాబాద్‌ : తెలంగాణలోని రైలు ప్రయాణికులకు తీపి కబురు. రాష్ట్రంలో రెల్వే కనెక్టివిటీ మరింత పెరగనుంది. ప్రయాణికులకు ఉపయోగపడే మూడు ప్రతిపాదిత రైల్వే ప్రాజెక్టులు కీలకదశలో ఉన్నట్లు సౌత్‌ సెంట్రల్‌ రైల్వే అధికారులు తెలిపారు. తెలంగాణలో రైల్వే కనెక్టివిటీ పెంచేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా కొత్త రైలు మార్గాలు నిర్మిస్తోంది. తాజాగా.. మరో మూడు ప్రాతిపాదిత లైన్ల ద్వారా రాష్ట్రంలో ట్రైన్ల కనెక్టివిటీ పెరగనుంది. సికింద్రాబాద్‌ – వాడి మధ్య 194 కి.మీ మేర ఫోర్‌ లైన్‌ రైల్వే విస్తరణకు అడుగులు పడుతున్నాయి. డోర్నకల్‌-మిర్యాలగూడతో పాటు కరీంనగర్‌-హసన్‌పర్తి కొత్త మార్గాలకు కూడా డీపీఆర్‌లు సిద్ధం అయ్యాయి. కేంద్రం ఆమోదం తెలిపి బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తే పనులు ప్రారంభం కానున్నాయి. పుణే, ముంబయి వైపు వెళ్లే సికింద్రాబాద్‌-వాడి మార్గం ప్రస్తుతం రెండు లైన్లతో ఉండగా.. దాన్ని విస్తరించనున్నారు. క్వాడ్రాప్లింగ్‌ (నాలుగు లైన్ల)కు విస్తరించేందుకు సౌత్‌ సెంట్రల్‌ రైల్వే సిద్ధమవుతోంది. ఈ లైన్‌ ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్‌ ఇప్పటికే రైల్వే బోర్డుకు అందింది. బోర్డు అనుమతి లభిస్తే.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టు మంజూరు అవుతుందని రైల్వేశాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దాంతో పాటుగా తెలంగాణలో మరో రెండు లైన్ల మంజూరుకు అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. కరీంనగర్‌-హసన్‌పర్తితో పాటు డోర్నకల్‌-మిర్యాలగూడ కొత్త రైల్వే లైన్లకు సంబంధించిన డీపీఆర్‌లు సిద్ధమయ్యాయి. ఇవి కొంతకాలం క్రితమే రైల్వే బోర్డుకు చేరాయి. ఈ మూడు రైల్వే ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.7,840.37 కోట్లుగా నిర్ణయించారు. ప్రాజెక్టులకు సంబంధించిన అలైన్‌మెంట్‌, దూరం, అంచనా వ్యయం వివరాలను డీపీఆర్‌లో పొందుపరిచారు. తెలంగాణ ప్రభుత్వం, ఎంపీలు ప్రత్యేక దృష్టి సారిస్తే ఈ మూడు రైల్వే ప్రాజెక్టులు వచ్చే బడ్జెట్‌లోనే మంజూరయ్యే అవకాశాలున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *