ఎనిమిది మంది మృతి..

  • ఘోర రోడ్డు ప్రమాదం…
  • ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలో ఘటన

ఓ స్కార్పియో అదుపు తప్పి లోతైన చెరువులో పడిరది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. వీరంతా ఒకేకుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. ఛత్తీస్‌గఢ్‌లోని బలరాంపూర్‌లో శనివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో డ్రైవర్‌ తీవ్ర గాయాలతో బయట పడ్డాడు. కానీ, డ్రైవర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. చెరువులో మరో యువకుడు గల్లంతవ్వగా తెల్లవారు జామున అతడి డెడ్‌ బాడీ స్థానికులు గుర్తించినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం సంఘటనా స్థలానికి చేరుకుని హుటాహుటినా సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం శనివారం అర్థరాత్రి జరిగింది. చనిపోయినవారిలో మహిళా ఉపాధ్యాయురాలు కూడా ఉంది. మార్గమధ్యంలో రాత్రి భోజనం ముగించుకుని సూరజ్‌పూర్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రాజ్‌పూర్లోని బుధ బాగీచా సమీపంలో స్కార్పియో వాహనం అదుపు తప్పి చెరువులో పడిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ముందుగా డ్రైవర్‌ను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం సమయంలో స్కార్పియోలో మొత్తం ఎనిమిది మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం గురించి ప్రజలు వెంటనే రాజ్‌పూర్‌ పోలీసులకు సమాచారం చేరవేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సుమారు గంటన్నర పాటు శ్రమించిన తర్వాత జేసీబీ సాయంతో స్కార్పియోను బయటకు తీశారు. ఆ వాహనం సెన్సార్‌ కారణంగా తలుపు లాక్‌ చేయబడిరది. దాంతో అందులో ఉన్న వారు బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో అందరూ లోపలే మృతిచెందారు..అతి వేగం, డ్రైవర్‌ మద్యం సేవించడమే ఈ ఘోర ప్రమాదానికి కారణమని అధికారులు భావిస్తున్నారు. ఇక, వెంటనే మృతుల కుటుంబాలకు పోలీసులు సమాచారం అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *