ఆ విషయాన్ని తప్పుగా చెబితే క్రిమినల్‌ చర్యలే..!

ఆ విషయాన్ని తప్పుగా చెబితే క్రిమినల్‌ చర్యలే..!

పీపుల్స్‌డైరీ`హైదరాబాద్‌ : కుల గణనను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. కుల గణన చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నవంబర్‌ 6 నుంచి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేయనుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. 150 కుటుంబాలకు ఒక ఎన్యూమరేటర్‌ను నియమించారు. అధికారులు ప్రస్తుతం ఇళ్లకు నంబర్లు వేస్తున్నారు. ఈ సర్వే కేవలం కులం మాత్రమే కాకుండా.. ఆర్థిక, విద్య, ఉపాధికి సంబంధించి కూడా సర్వే చేయనున్నారు. అధికారులు మీ ఇంటికి వచ్చినప్పుడు కులంతో పాటు ఆర్థిక స్థితి, ఇంట్లో ఎవరైనా ఉద్యోగాలు చేస్తున్నారా అనే విషయాలు కూడా కనుక్కునే అవకాశం ఉంది. కులం తప్పుగా చెబితే.. క్రిమినల్‌ చర్యలు ఉంటాయని బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ జి.నిరంజన్‌ హెచ్చరించారు. అన్ని వర్గాల ప్రజలకు మేరు జరిగేందుకు ఈ సర్వే చేస్తున్నట్లు వివరించారు. సర్వే పేపర్‌ మొత్తం 75 ప్రశ్నలు ఉన్నాయి. వీటికి అన్ని సమాధానం చెప్పాల్సిందే. ప్రతి కుటుంబానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని నమోదు చేయనున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *