పోలీసులపై నక్సల్స్ దాడి
పీపుల్స్‌డైరీ`చర్ల : ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా జాగరగుండ వీక్లీ మార్కెట్‌లో విధులు నిర్వహిస్తున్న సైనికులపై నక్సలైట్లు అకస్మాత్తుగా దాడి చేశారు. డ్యూటీలో ఉన్న ఇద్దరు సైనికులపై నక్సలైట్లకు చెందిన మినీ యాక్షన్ టీమ్ దాడి చేసింది. ఈదాడిలో దాడిలో ఇద్దరు సైనికులు గాయపడ్డారు. జాగర్గుండ ఆసుపత్రిలో చికిత్స తరలించి చికిత్స చేస్తున్నట్టు తెలిసింది. మార్కెట్‌లో గందరగోళం నెలకొనడంతో పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఘటనను ఎస్పీ కిరణ్ చవాన్ ధృవీకరించారు.