అమరావతి ఓఆర్‌ఆర్‌కు కసరత్తు
- డీపీఆర్, ఎలైన్‌మెంట్‌పై ఫోకస్
పీపుల్స్‌డైరీ`అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధాని ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన ప్రక్రియ వేగవంతం అవుతోంది. ఓఆర్‌ఆర్ ఎలైన్‌మెంట్ ఖరారు, డీపీఆర్ పనులు ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రిక్వెస్ట్‌తో.. ఈ ఓఆర్‌ఆర్ భూసేకరణ సహా ఖర్చు మొత్తం భరించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులకు ఓ ఆర్‌ఆర్ తుది ఎలైన్‌మెంట్ ఖరారు చేయాలని, డీపీఆర్ సిద్ధం చేయాలని ఆదేశాలొచ్చాయి. ఇటీవల ఆర్వీ అసోసియేట్స్ (సలహా సంస్థ)తో కలిసి పనులు ప్రారంభం అయ్యాయి. ఈ మేరకు సర్వేలు పూర్తిచేసి ఏడాదిలో డీపీఆర్ రూపకల్పన పూర్తిచేయాలని టార్గెట్‌గా పనిచేస్తున్నారు. 2018లో మొత్తం 189 కి.మీ. ఉన్న ఓఆర్‌ఆర్ ఎలైన్‌మెంట్‌ను రూపొందించిన సంగతి తెలిసిందే. కానీ ఈ ఎలైన్‌మెంట్ రూపొందించి ఆరేళ్లు కావడంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎలైన్‌మెంట్‌ను మరోసారి పరిశీలించేందుకు డ్రోన్ వీడియోలు తీసి.. పాత ఎలైన్‌మెంట్లో కొత్తగా ఏవైనా నిర్మాణాలు వచ్చాయా? రోడ్లు వేశారా? ఓఆర్‌ఆర్ మీదుగా హైటెన్షన్ విద్యుత్ లైన్లు ఎన్ని ఉన్నాయనే అంశాలను పరిశీలిస్తున్నారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యాక.. ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తారు.