లోయలోకి దూసుకెళ్లిన బస్సు

లోయలోకి దూసుకెళ్లిన బస్సు

  • 23 మంది దుర్మరణం
  • మరో 20 మందికి తీవ్ర గాయాలు
  • ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాలో ఘటన

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. సోమవారం ఉదయం ప్రయాణీకులతో వెళ్తోన్న ఓ బస్సు అల్మోరా జిల్లాలోని మర్చులా వద్ద అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. కుపి ప్రాంతంలో జరిగిన ఈ దుర్ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం గురించి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అంబులెన్సుల్లో సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో మరి కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బస్సు ఓవర్‌లోడ్‌ కారణంగానే అదుపుతప్పి లోయలో పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సహాయక చర్యలు వేగంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తీవ్రంగా గాయపడిన ప్రయాణికులను మెరుగైన వైద్యం అందజేయాలని, సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షలు, క్షతగాత్రులకు రూ.లక్ష ఆర్ధిక సాయం ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *