*ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు నదిలో దూకి ఆత్మహత్యయత్నం*
*తండ్రి కూతురు గల్లంతు.
*తల్లిని కాపాడి ఒడ్డుకు చేర్చిన స్థానికులు*
కొనసాగుతున్న గాలింపు చర్యలు*
*అప్పుల బాధ తట్టుకోలేక కఠిన నిర్ణయం*
*మూడు లక్షల రుణా అప్పుకు వడ్డీ చక్ర వడ్డీతో వేధింపులు*
నిర్మల్ (పీపుల్స్ డైరీ) : పవిత్ర పుణ్యక్షేత్రం చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం సమీపాన పుణ్య నది గోదావరి ఉండగా బుధవారం సాయంత్రం సమయంలో నిజామాబాద్ పట్టణానికి చెందిన న్యాల్కల్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు తమ కూతురుతో కలిసి బాసర పుణ్యక్షేత్రానికి చేరుకొని గోదావరి వద్ద స్కూటీపై వచ్చి నది పక్కన స్కూటీ ఆపి వంతెన నుండి ముగ్గురు దూకి ఆత్మహత్యకు ప్రయత్నించారు. అక్కడున్న స్థానికులు గమనించి గజ యితగాళ్లతో గాలింపు చర్యలు కొనసాగించగా తల్లి క్షేమంగా బయటపడగా తండ్రి నీట మునిగి చనిపోయైడు. కూతురు కనిపించకపోవడంతో పోలీసుల గజ ఈతగాళ్లు రాత్రి వరకు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు ఈ నేపథ్యంలో బాసర గోదావరి నదికి వచ్చి పుణ్యస్నానం ఆచరించి అమ్మవారిని దర్శించుకోని వారు ఈ సంఘటనకు పాల్పడ్డారు.తండ్రి కూతుళ్లు నీళ్లలో గల్లంతు కాగా తల్లిని మాత్రం ప్రాణాపాయం నుండి బయటపడింది.
*ఈ ఘటనకు కారణం అప్పుల బాధనే*
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాల్కల్ రోడ్లు ఉప్పల్ నుంచి వేణు అతని భార్య అనురాధ కూతురు పూర్ణిమ ఉంటున్నారు వేణు స్థానికంగా చిరు వ్యాపారం చేస్తూ కుటుంబ భారాన్ని పోషిస్తున్నాడు వ్యాపారం కోసం గంజ్ మార్కెట్లో రోషన్ వికాస్ దగ్గర వేణు రూపాలు 3 లక్షల దాకా అప్పు చేశాడు ఈ మొత్తానికి వడ్డీ చక్రవడ్డీ కట్టాలని రోషన్ వికాస్ వేధింపులకు గురి చేయడంతో డబ్బులు చెల్లించకపోతే మనుషులను పంపించి వేణు భార్య కూతురును వ్యవస్థరాలను చేస్తామని వేణు బెదిరించినట్లు వెల్లడి.
*పోలీసులకు ఫిర్యాదు కేసు నమోదు*
ఓవైపు వ్యాపారం అనుకున్నంత సాగకపోవడం మరోవైపు వడ్డీ వ్యాపారులు వేదంపూలు ఈ క్రమంలో వేణు మనస్థాపానికి గురయ్యారు అనర్థ ఆలోచనలతో భార్య బిడ్డలతో కలిసి ఆత్మహత్య శరణ్యం మని నిర్ణయించుకుని ఇందులో భాగంగా బుధవారం ఉదయం బాసర చేరుకొని గోదావరి నదిలో దూకారు కాక స్థానికులు రక్షించడంతో ప్రాణాలతో బయటపడ్డ అనురాధ అప్పుల వాళ్లు వేధింపులను బయట పెట్టింది ఆమె ఫిర్యాదు మేరకు ముధోల్ సిఐ మల్లేష్ బాసర ఎస్సై గణేష్ కేసు నమోదు చేసుకుని గల్లంతైన కూతురు కోసం ప్రత్యేక పడవలు పోలీసులు స్థానిక గజతగాళ్లు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు
*బాసర గోదావరి వంతెన వద్ద రక్షణ కవచం చేపట్టాలి*
ముధోల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లేష్ పత్రిక సమావేశంలో మాట్లాడుతూ. గత ఆరు సంవత్సరాల నుండి దాదాపు 100కు పైగా ఆత్మహత్యలు చేసుకోగా 11 నెలలో 28 మంది వివిధ కారణాలవల్ల కొందరు యువకులు జంటలు ఆత్మహత్యలకు పాల్పడి ఉంటారని గోదావరి వంతెన నుండి మొదటి ఘాట్ వరకు నిజాంబాద్ జిల్లా ఎంచా నుండి వంతెన మార్గాన ప్రత్యేక కవచం ఏర్పాటు చేసి సీసీ కెమెరాలతో నిఘనిడా పెట్టాలని ఇక్కడ ఎవరైతే అనుమానస్పదంగా తిరుగుతూ ఉంటారు వారిని కౌన్సిలింగ్ ఇవ్వాలని ఇప్పటికే స్థానిక పోలీసులను ఆదేశాలు జారీ చేయడం జరిగిందని పేర్కొన్నారు వీరి వెంట ముధోల్ ఎస్సై సాయికుమార్ బాసర ఎస్సై గణేష్ పోలీసులు పలువురు ఉన్నారు