- డ్రైవర్ కి స్వల్ప గాయాలు
- నుజ్జునుజైన కారు
- ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ తో తగ్గిన నష్టం
నల్లబెల్లి : వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రుద్రగూడెం గ్రామ మూలమలపు జాతీయ రహదారి 365 పై గురువారం కారు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ములుగు జిల్లా చర్ల వెంకటాపురం నుండి కారులో కనకపల్లి గణేష్ అతని స్నేహితులు నర్సంపేటకు వెళ్తున్నారు. ఈ క్రమంలో రుద్రగూడెం గ్రామ శివారు మూలమలుపు వద్ద కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. డ్రైవర్ కు స్వల్ప గాయాలు కాగా 108 వాహనంలో నర్సంపేట ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ప్రమాదానికి సంబంధించి స్థానిక ఎస్ఐ ప్రశాంత్ బాబు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.