- మరో మూడు నెలల్లో అందరికీ అందుబాటులోకి…
- ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
- విజయవాడ నుంచి శ్రీశైలం వరకు సీప్లేన్
- త్వరలో ఛార్జీలపై క్లారిటీ
పీపుల్స్‌డైరీ`అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో సీ ప్లేన్ అందుబాటులోకి వచ్చనట్లయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ నుంచి శ్రీశైలంకు సర్వీసులు ప్రారంభించారు. అయితే ఈ సీ ప్లేన్‌పై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సీ ప్లేన్‌ను అందరికీ అందుబాటులోకి తెస్తామని.. మరో 3-4 నెల్లలో ఏపీలో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. సీ ప్లేన్‌లో ప్రయాణం సామాన్యులకు అందుబాటు ధరల్లో ఉంటుందని చెప్పారు. ఈ సీ ప్లేన్‌లను ఏపీలో 4 రూట్లలో నడిపేందుకు ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ సీన్ ప్లేన్ విజయవంతం అయితే మరికొన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ రైడ్‌కు ఛార్జీల కింద ఎంత మొత్తం వసూలుచేయాలి? రోజుకు ఎన్నిసార్లు నడపాలనే ప్రతిపాదనలను అధికారులు త్వరలోనే రూపొందించనున్నారు. టెండరు ప్రక్రియ ద్వారా కాంట్రాక్ట్ సంస్థను ఎంపిక చేసి సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెబుతున్నారు. అధికారులు. రాష్ట్రంలో నీళ్లు అందుబాటులో ఉండే చోట వీటిని తీసుకురావాలనుకుంటున్నారు. ఈ సీ ప్లేన్ విజయవాడలోని పున్నమి ఘాట్ నుంచి శ్రీశైలం వరకు నడుస్తుంది. మొత్తం 14 మంది కూర్చునేలా సీ ప్లేన్ సీటింగ్ అందుబాటులో ఉన్నాయి. ఈ సీ ప్లేన్ 1,500 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుంది. సీ ప్లేన్‌లో విజయవాడ నుంచి శ్రీశైలం వరకు సుమారు 150 కి.మీ ఉంటుంది. విమానాలు భూమికి 15-20 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తాయి.. అయితే సీ ప్లేన్‌లు కూడా అదే స్థాయిలో ఎగిరే అవకాశం ఉంది. కానీ సీ ప్లేన్ ఎక్కే పర్యాటకులకు ప్రకృతి అందాలను చూపించే అనుభూతి అవకాశం కల్పించనున్నారు. ఈ మేరకు ఇలా తక్కువ ఎత్తులో ప్రయాణానికి ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్) నుంచి అవసరమైన అనుమతులను తీసుకున్నారు. సీ ప్లైన్‌లో విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్లేందుకు 30 నిమిషాలే పడుతుంది. టేకాఫ్, ల్యాండిరగ్ రెండూ నీటిలోనే ఉంటుంది. అయితే టేకాఫ్, ల్యాండిరగ్ కోసం 10 నిమిషాలు పోను.. 20 నిమిషాలు ఆకాశంలో విహరిస్తారు. ఈ సీ ప్లేన్ కోసం నీటిలో తేలియాడే జెట్టీలను ఏర్పాటు చేయనున్నారు. విజయవాడలోని పున్నమి ఘాట్‌లో ప్రత్యేక జెట్టీని ఏర్పాటు చేశారు.