- కారు నడిపిన కేటీఆర్…
- సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
పీపుల్స్‌డైరీ`హైదరాబాద్ : కేసీఆర్ యాక్టివ్ మోడ్‌లోకి మారిపోతున్నారు. కొంత కాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తిరిగి యాక్టివ్ అవుతున్నట్లు కనిపిస్తోంది. మొన్న గజ్వేల్‌లోని ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో పాలకుర్తి నియోజకవర్గం నేతలతో కేసీఆర్ సమావేశం అయ్యారు. త్వరలో జిల్లాల యాత్రలు చేసే అవకాశం ఉన్నట్లు బీఆర్‌ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఎర్రవల్లి ఫాం హౌస్‌లో కారు నడుపుతూ కేసీఆర్ కనిపించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు, చేవెళ్ల యువనేత పట్లోల్ల కార్తీక్ రెడ్డిని పక్కన కూర్చో బెట్టుకొని కారు నడిపారు కేసీఆర్. ఫామ్‌హౌస్‌లో సాగవుతున్న పంట పొలాలను పరిశీలించి, వాటి గురించి కార్తీక్ రెడ్డికి వివరించినట్లు తెలుస్తోంది. కేసీఆర్ నడిపిన కారు ‘మెర్సిడెస్ బెంజ్’ అని తెలుస్తోంది. వైట్ కలర్‌లో కారు రాయల్‌గా కనిపిస్తోంది. ఈ ఏడాది జులైలో కేసీఆర్ ఓమ్నీ వ్యాన్ నడిపిన సంగతి తెలిసిందే. డాక్టర్ల సూచనతో నాడు ఆయన తన ఫాం హౌస్‌లో వ్యాన్ నడిపారు. ఒంటరిగా కాసేపు వ్యాన్‌లో కలియతిరిగారు. గత ఏడాడి డిసెంబర్ 8న అర్ధరాత్రి ఇంట్లో కాలు జారిపడటంతో కేసీఆర్ తుంటి ఎముక విరిగింది. యశోదా ఆస్పత్రిలో డాక్టర్ల చికిత్స అనంతరం కోలుకున్న కేసీఆర్.. ఎర్రవెల్లి ఫాం హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. తాజాగా కేసీఆర్ కారు నడిపిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టైగర్ ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ‘కారు మాదే.. నడిపేది మేమే’ అంటూ ఓ యూజర్ కామెంట్ పెట్టాడు. ‘ఈసారి కారు జోరును అడ్డుకోలేరు’ అంటూ మరో యూజర్ కామెంట్ చేశాడు.