సీనియర్ కార్యకర్త గోపాల్‌కు ‘బండి’ పరామర్శ
అధైర్యపడొద్దని ధైర్యం చెప్పిన కేంద్ర మంత్రి
సైదాపూర్, నవంబర్ 10 (పీపుల్స్‌డైరీ) : కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రానికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హోదాలో మొదటిసారి రాగా పార్టీ ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం సైదాపూర్ గ్రామానికి చెందిన సీనియర్ కార్యకర్త దాసరి గోపాల్‌ను బండి సంజయ్ కుమార్ పరామర్శించి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. గత కొన్ని నెలల క్రితం టాక్టర్ రోటోవేటర్లో కాలుపడి నుజ్జునుజ్జు అయి కాలు తీసివేయడంతో అంగవైకల్యంతో బాధపడుతున్న దాసరి గోపాల్‌కు బండి సంజయ్ కుమార్ ధైర్యం చెప్పి బాధితునికి ప్రభుత్వం తరఫున టూ వీలర్ బ్యాటరీ బండి ఇప్పిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ రెడ్డి, వెన్కేపల్లి మాజీ ఎంపీటీసీ సభ్యులు జంపాల సంతోష్, గుర్రాల లక్ష్మారెడ్డి, సీనియర్ నాయకులు వీరమల్ల రవీందర్ రెడ్డి ముత్యాల రమణారెడ్డి వంగ సాగర్ నెల్లి శ్రీనివాస్ దెంచనాల శ్రీనివాస్ భరద్వాజ్ మెరుగు శ్రీనివాస్ గుర్రాల అశోక్ రెడ్డి పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజలు ఉన్నారు.