ఆశ్రమ పాఠశాల వార్డెన్ పై కలెక్టర్ ఆగ్రహం

కలెక్టర్ ఆకస్మిక తనిఖీ…

నల్లబెల్లి: మండలంలోని మూడు చెక్కలపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల వార్డెన్ ఫై వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మండలంలోని రుద్రగూడెం గ్రామంలో నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమాన్ని సందర్శించిన అనంతరం ఆమె మూడు చెక్కలపల్లి ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలనుఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె పాఠశాలలోని వంట గదిని పరిశీలించారు. స్టీమ్ ఇంజన్ (ఆవిరి యంత్రం )నిరూపయోగంగా ఉండటానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. వంట పాత్రలు, పరిసరాలను పరిశుభ్రంగా ‘ఉంచుకోవాలని సూచించారు.

ల్యాబ్ లో పరికరాలు సరిగా లేకపోవడంతో ఆశ్చర్యానికి గురైన ఆమె ప్రధానోపాధ్యాయుడి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గేటు ముందు ఉండవలసిన ఫిర్యాదుల పెట్టే వార్డెన్ రూమ్ లో ఉండడం పట్ల ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ సంబంధిత శాఖ ఉన్నతాధికారికి ఫోన్ ద్వారా సమాచారం అందించి వెంటనే ఫిర్యాదులు పెట్టెను ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీను తో పాటు హాస్టల్ వార్డెన్ వీరమ్మ కు షోకాజు నోటీసులు అందజేశారు. వీరి వెంట జడ్పీ సీఈవో, స్థానిక తహసీల్దార్ ముప్పు కృష్ణ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *