మండల కేంద్రంలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు.. శృతిమించితే కేసులు

మండల కేంద్రంలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు.. శృతిమించితే కేసులు…

నల్లబెల్లి _పీపుల్స్ డైరీ

నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి అపశ్రుతులు చోటు చేసుకోకుండా ఉండేందుకు నల్లబెల్లి పోలీసులు చర్యలు ప్రారంభించారు. మంగళవారం రాత్రి బస్టాండ్ ఆవరణంలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు ప్రారంభించారు.డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు బ్రీత్ అనలైజర్ల ద్వారా నిర్వహిస్తున్నారు. రోడ్లపై ఇష్టానుసారంగా తిరగకుండా వాహనాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు.శ్రుతి మించితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. నల్లబెల్లి ఎస్సై వి గోవర్ధన్ మండల కేంద్రంలో తనిఖీలు నిర్వహించారు. మండల వ్యాప్తంగా తనిఖీల్లో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *