ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక..

ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక..

వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో సీనియర్ పాత్రికేయులు కాసర్ల నరసింహ రెడ్డి సూచనల మేరకు మంగళవారం పత్రిక విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశం లో “కలం ప్రెస్ క్లబ్” అధ్యక్షుడిగా కొమ్ము బాలరాజు ,గౌరవ అధ్యక్షులు గా అశోక్ రావు ను ప్రధాన కార్యదర్శి గా రొట్టె సురేష్,సలహా దారుడిగా మెడిపెల్లి సుధాకర్ , సహాయ కార్యదర్శి గా అడ్డ సతీష్,కోశాధికారిగా విజయ్ కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పత్రిక విలేకరులు పాల్గొన్నారు. అనంతరం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన కొమ్ము బాలరాజు మాట్లాడుతూ అందరినీ కలుపుకొని నడుస్తున్నాని అన్నారు. తనను అధ్యక్షుడిగా ఎన్నిక చేసినందుకు అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *