ఎంజాయ్ చేయండి…కానీ…
ఎక్స్ ట్రాలు చేయకండి…!!!
నల్లబెల్లి డిసెంబర్ 31 (పీపుల్స్ డైరీ)
నల్లబెల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలు నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో, సంతోషాల నడుమ జరుపుకోవాలని నల్లబెల్లి ఎస్పై వి గోవర్దన్ ప్రజలకు సూచించారు.మండల వ్యాప్తంగా అడుగడుగునా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తాం. మద్యం తాగి రోడ్ల మీదకి వాహనాలతో ఎట్టి పరిస్థితుల్లో రాకండి. అర్థరాత్రి ఆరుబయట వేడుకలకు అనుమతులు లేపు. సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ సెక్షర్ 144 సిఆర్ పిసి అమలులో ఉంది.. బహిరంగ ప్రదేశాలలో ఐదుగురు, అంతకన్నా ఎక్కువ వ్యక్తులు గుమ్మిగూడటం నిషేధం అని మరిచిపోకండి.. ఆరుబయట ప్రదేశాలలో డి జే లు ఎక్కువ శబ్దాన్ని ఇచ్చే సౌండ్ సిస్టంలను వినియోగించకండి. గుంపులు, గుంపులుగా చేరి రోడ్లపై కేకలు వేస్తూ అల్లరి చేయడం కేకలు పెడుతూ వాహనాలపై తిరగడం మండలంలో పూర్తిగా నిషేధం.డిసెంబర్. 31వ తేదీన సాయంత్రం ఐదుగంటల నుంచే అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలోనూ గస్తీ ముమ్మరంగా ఉంటుంది. అనవసరంగా నూతన సంవత్సర వేళ కొత్త చిక్కులు కొని తెచ్చుకోకండి. అల్లర్ల కు పాల్పడితే అస్సలు ఉపేక్షించం.. చర్యలు తీవ్రంగా ఉంటాయి. మర్చిపోకండి క్షణికానందంకోసం డిసెంబర్-31 నిబంధనలు ఉల్లంఘించినా.. తప్పులు చేసినా, ప్రమాదాల బారినపడిన మీ అజాగ్రత్త వల్ల మరొకరు ప్రమాదానికి గురైనా.. మీ కుటుంబం మొత్తానికి నూతన సంవత్సరం ఓ చేదు జ్ఞాపకంగా మిగిలిపోతుందని మరచిపోకండి. 2025 నూతన సంవత్సరానికి ఆనందంగా మరింత ఉత్సాహంగా, సరికొత్త ఆలోచనలతో స్వాగతం పలుకుదాం.. ఈ సందర్భంగా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు