ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా
– ట్రాక్టర్ డ్రైవర్ మృతి
– గాంధీనగర్ లో ఘటన

పీపుల్స్ డైరీ, గణపురం: ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడిన ఘటన ఆదివారం మండలంలోని గాంధీనగర్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… గణపురం మండలంలోని గాంధీనగర్ గ్రామానికి చెందిన మోటపోతుల రాజు (36) ఆదివారం సాయంత్రం ట్రాక్టర్ పై మైలారం వెళుతున్న క్రమంలో ప్రమాదవశాత్తూ ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో రాజు ట్రాక్టర్ కింద పడి తివ్రగాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు 108 వాహనంలో భూపాలపల్లి వంద పడకల ఆసుపత్రికి తరలించగా అప్పటికే రాజు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడు రాజుకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. రాజు మృతితో గాంధీనగర్ లో విషాదఛాయలు అలుముకున్నాయి.