జాతీయ లోక్ అదాలత్ లో కేసుల పరిష్కారం
– చెల్పూర్ చౌరస్తాలో న్యాయ అవగాహన కార్యక్రమం
పీపుల్స్ డైరీ, గణపురం: జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణాల్లో మార్చి 08 న నిర్వహించబోయే జాతీయ లోక్ అదాలత్ లో పెద్ద ఎత్తున కేసులు పరిష్కరించబడతాయని డిప్యూటీ, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్స్ కంప అక్షయ, జి. ప్రియాంక తెలిపారు. మంగళవారం గణపురం మండలంలోని చెల్పూర్ చౌరస్తాలో ప్రజలకు న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మొబైల్ వ్యాన్లో చౌరస్తాకు చేరుకున్న జిల్లా న్యాయసేవాధికార సంస్థ బృందం చిరు వ్యాపారులకు, వాహనదారులకు అవగాహన కల్పించారు. ఆర్థికంగా వెనకబడిన మరియు నిమ్న కులాల వారికీ, మహిళలకు, వయో వృద్దులకు ఉచిత న్యాయ సహాయం అందించడమే జిల్లా న్యాయసేవాధికార సంస్థ యొక్క లక్షమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
