గ్రంథాలు తెలియని వారికే గ్రంథాలయ చైర్మన్ గా బాధ్యతలా..?

గ్రంథాలు తెలియని వారికే గ్రంథాలయ చైర్మన్ గా బాధ్యతలా..?

పార్టీల మీద పార్టీలు మారిన వారికే పదవులా..??

దయానంద్ కాలని కనకదుర్గ ఆలయం దోపిడీ దారులకు నిలయం

అక్రమంగా దేవస్థాన స్థలాన్ని ట్రస్ట్ గా మార్చిన ఘనుడు

ఏకంగా కుటుంబ సభ్యులను చేర్చి పక్కా పత్రాలు

ఆలయ ప్రత్యేక కార్యనిర్వహణాధికారిగా పెత్తనం

ఆలయ హుండీ లెక్కల్లో గల్లంతు లెక్కలే చూపని వైనం

దాతలు అందించిన కానుకలు స్వంత హుండీలోకి

కోట్ల రూపాయల ఆలయ భూమి కొల్లగొట్టే ప్రయత్నం

దేవాలయం ప్రభుత్వ పరిధిలో లేకనే అస్థి జప్తుకు యత్నం

ఒక్క ఆలయమే కాదు అధికార పార్టీ పేరు పై అక్రమాలు

ప్రజా ప్రతినిధుల వద్ద పైరవీలు చేస్తూ పదవులు

పార్టీ జెండా మోసిన వారికి పదవులు కరువు

సీనియర్లను గుర్తించి పదవి కేటాయించాలంటున్న నాయకులు

పీపుల్స్ డైరీ ప్రతినిధి వరంగల్

వరంగల్ జిల్లాలో చైర్మన్ పదవుల కోలాహలం మొదలైంది కాంగ్రెస్ పార్టీ సీనియర్లు పార్టీలు పిరాయించిన నాయకులు ప్రజాప్రతినిధుల వద్దకు క్యూ కడుతున్నారు గత కొన్ని రోజులుగా వరంగల్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవికి పోటా పోటీగా నాయకులు ఫైరవీలు కొనసాగిస్తున్నారు చివరగా సీనియర్ల కు కాకుండా అక్రమాలకు పాల్పడుతూ దేవాలయ భూమిని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నవారికి పదవి కట్టబెట్టడానికి ప్రయత్నాలు సాగుతున్నట్టు తెలిసింది గతంలో దయానంద్ కాలని కనకదుర్గ ఆలయానికి సంబంధించిన భూమిని ట్రస్టు పేరు తో కుటుంబ సభ్యులను మాత్రమే చేర్చి పత్రాలను సృష్టించి ఆలయంలో కుటుంబ పాలన నిర్వహిస్తున్నారని ఆలయ భూమిని ఆక్రమించే ప్రయత్నాలు సాగిస్తున్నాడని ఆరోపణలు వెల్లు వెత్తుతున్న తరుణంలో ఆరోపణలు ఎదుర్కొంటూ అక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తికి గ్రంథాలయ చైర్మన్ పదవి అంటగట్టడం పై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి భూ ఆక్రమణ కాకుండా ఆలయ అభివృద్ధికి దాతలు కేటాయించిన కానుకలు స్వలాభానికి వాడుకున్నట్టు హుండీ లెక్కింపు లేకుండా ఇష్టారాజ్యంగా ఆలయ కార్యనిర్వహణ అధికారిగా పెత్తనం చెలాయిస్తున్నట్టు తెలిసింది ట్రస్టు పేరు తో కోట్ల రూపాయల స్థలాన్ని హుండీ ఆదాయం లెక్కలు లేకుండా భక్తులు వేసే కానుకలు సైతం స్వంతానికి ఉపయోగించడం పై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇక వివరాల్లోకి వెళితే గతంలో బిఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం కాంగ్రెస్ లో ప్రజా ప్రతినిధుల పేరు చెబుతూ అక్రమాలకు పాల్పడుతున్న సీనియర్ నాయకులు నటులు గా చెప్పుకోబడే వ్యక్తి ప్రస్తుతం వార్తల్లో కి రావటం తన పై పలు ఆసక్తికర విషయాలు బహిర్గతం అవుతున్నాయి వరంగల్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ పోటీలో మొదటి వరుసలో ఉండటం సీనియర్లు జీర్ణించుకోలేక గత కొన్నెండ్లుగా పార్టీ జెండా మోసిన మాకు అన్యాయం జరుగుతుందని పార్టీలు మార్చి మార్చి వచ్చిన నాయకులకు ప్రాతినిధ్యం ఇవ్వడం పై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అక్రమాలకు పాల్పడుతూ ప్రజా ప్రతినిధుల పరువు తీస్తూ పేదల పొట్ట గొడుతున్న వ్యక్తికి గ్రంథాలయ ఛైర్మన్ బాధ్యతలు అంటగట్టటానికి ప్రయత్నం చేస్తున్నారని సీనియర్లు విమర్శిస్తున్నారు అమ్మవారి పేరు తో భక్తులు కేటాయించిన కానుకలతో ప్రజా ప్రతినిధుల పేరు చెబుతూ పెత్తనం చెలాయిస్తున్న సీనియర్ నాయకులమంటూ నియోజక వర్గంలో అక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తులకు పదవులు కేటాయిస్తే పదవికి ప్రజా ప్రతినిధులకు పార్టీ పరువు పోతుందని పూర్తి విచారణ అనంతరం సీనియర్ నాయకులు అనుభవజ్ఞులైన వారికి పదవులు కేటాయిస్తే బావుంటుందని కొందరు పార్టీ శ్రేణులు చర్చించుకోవడం కొసమెరుపు

దేవాదాయ శాఖా మంత్రి పునరాలోచించాలి

దేవాదాయ శాఖా మంత్రి వరంగల్ తూర్పు శాసన సభ్యులు కొండా సురేఖ నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న సీనియర్ నాయకులమంటూ అక్రమాలకు పాల్పడుతున్న వారిపై దృష్టి సారించాలని కొన్నెండ్లుగా పార్టీ జెండా మోస్తూ పార్టీ కట్టుబాట్లు ఆచరిస్తూ పార్టీనే నమ్ముకున్న సీనియర్ లకు పదవులు కేటాయించాలని వేడుకుంటున్నారు మరో కీలకమైన విషయం ఓ సిటీ దయానంద్ కాలని కి సంబంధించిన కనకదుర్గ ఆలయాన్ని దేవాదాయ శాఖలో చేర్చుకుని దేవాలయ ఆస్తులను కాపాడాలని అక్రమంగా ట్రస్టు పేరు తో కుటుంబ సభ్యులను చేర్చి పత్రాలను సృష్టించిన కాంగ్రెస్ సీనియర్ పార్టీ పిరాయింపు నాయకుల పై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని ఆలయ భక్తులు ఆలయ అభివృద్ధికి దోచిన సొమ్మును వసూలు చేస్తూ చర్యలు తీసుకోవాలని దాతలు సైతం వేడుకుంటున్నారు

గుడిసె వాసుల వద్ద మీసాలు దువ్వి వసూళ్లు…?

వచ్చే సంచికలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *