
వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే తాజాగా మరో ఆర్టీసీ కార్మికుడు ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ ఆత్మహత్యాయత్నం చేశాడు
ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది డిమాండ్లను నెరవేర్చే విషయంలో రాష్ట్రప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే తాజాగా మరో ఆర్టీసీ కార్మికుడు ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ ఆత్మహత్యాయత్నం చేశాడు.
ఆర్టీసీ డ్రైవర్ వెంకన్న నల్గొండ బస్ డిపో ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. తోటి కార్మికులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది.రాష్ట్రవ్యాప్తంగా సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మికులు రెండోరోజు అన్ని ఆర్టీసీ డిపోల ఎదుట మహాధర్నాకు పిలుపునిచ్చారు.
నర్సంపేట డిపో ఎదుట ధర్నాలో పాల్గొన్న డ్రైవర్ శంకర్ గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోగా.. సహచర కార్మికులు వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పివేసి వరంగల్ ఆసుపత్రికి తరలించారు.