జాతీయ జెండాకు అవమానం.*

సైదాపూర్ (పీపుల్స్ డైరీ)

సైదాపూర్ మండలంలోని సోమారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆదివారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ కార్యదర్శి యు రాజీవ్ జాతీయ జెండా ఎగురవేసే క్రమంలో దారం తెగి కింద పడిపోయినది. నిర్లక్ష్యం కారణంగా జాతీయ జెండాకు అవమానం జరిగిందనే విమర్శలు వ్యక్తమయ్యాయి . ఈ విషయాన్ని కార్యదర్శి దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ జెండాను సరిచేసే ప్రయత్నం చేయకపోవడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే జాతీయజెండా అవమానపరిచిన కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. విద్యా వంతుడై ఉండి కింద పడేసి ఆవిష్కరించడం విమర్శకు కారణమైంది. బాధ్యత గల వ్యక్తి జెండా ఆవిష్కరణలో ఇలా వ్యవహరించడం బాధాకరమని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *