ఆశ వర్కర్‌ దురుసు ప్రవర్తన.. కలెక్టర్‌కు ఫిర్యాదు…!

  • శిశువుకు ఇంజెక్షన్‌ నిర్లక్ష్యం.. ఆశపై శివశంకర్‌ ఫిర్యాదు
  • “ప్రసవం ప్రభుత్వ ఆసుపత్రిలో కాదు” అంటూ సేవలు నిరాకరణ
  • అసభ్య పదజాలం, బెదిరింపులు.. ఆశపై కఠిన చర్యలు కోరిన బాధితుడు

పీపుల్స్ డైరీ, గణపురం : మండల కేంద్రంలో పనిచేసే ఆశ వర్కర్ పై బుధవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్ లకు బుధవారం పల్లెబోయిన శివశంకర్ ఫిర్యాదు చేశారు. బాధితుడు పల్లెబోయిన శివశంకర్ తెలిపిన వివరాల ప్రకారం శివకుమార్ సోదరి కుమారుడు నెలన్నర వయస్సు గల శిశువుకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేయవలసిన ఇంజక్షన్ విషయమై ఈనెల 17 శనివారం  ఆశ వర్కర్ కు ఫోన్ చేసి ఇంజక్షన్ వేయాలని చెప్పాడు. దీంతో సంబంధిత ఆశ వర్కర్  మీరు వేరే దగ్గర అత్తగారింటి దగ్గర నివాసం అంటున్నారని. మీరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం కాలేదని ఇక్కడ ఇంజక్షన్ వేయడం కుదరదు బుక్ అక్కడే ఉంటుందని చెప్పిందన్నారు. అంతేకాక  డాక్టర్ ఒప్పుకోదని చెప్తూ  4 రోజులు కాలయాపన చేసిందన్నారు. స్థానిక ఏఎన్ఎంకు కూడా  సమాచారం  అందించలేదని తెలిపారు.  ఈ నేల 20 మంగళవారం స్థానిక వైద్యురాలు అల్లూరి అనూష ను కలిసి విషయం మొత్తం చెప్పగా ఎక్కడైనా ఇంజక్షన్ వేస్తారని సంబంధిత ఆశ వర్కర్ కు నేను చెబతానని  ఆశ వర్కర్ ని కలవండి అనగా మళ్ళీ ఆశ వర్కర్ గంగారపు రమ కు ఫోన్ చేసి అడిగిన సందర్భంలో, ఆశా వర్కర్  విధుల పట్ల బాధ్యత లేకుండా వ్యవహరించడమే కాకుండా, మా ఇంటి వద్దకు వచ్చి అత్యంత దురుసుగా, నోటితో చెప్పలేని విధంగా అవమానకరంగా ప్రవర్తించారని. ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకోమని దురుసుగా మాట్లాడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్రమైన  అసభ్య పదజాలం, బెదిరింపులకు పాల్పడ్డ ఆశా వర్కర్ ఫై తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *