ట్రాఫిక్ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలి

ట్రాఫిక్ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలి

ఎస్ఐ కరుణాకర్

రోడ్డు భద్రతపై ఆటో డ్రైవర్లకు అవగాహన

ఇనుగుర్తి (పీపుల్స్ డైరీ) : ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని ఎస్ఐ కరుణాకర్ సూచించారు. సోమవారం రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఆటో యూనియన్ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోకూడదని, అతివేగం ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు. డ్రైవింగ్ చేసేటప్పుడు తప్పనిసరిగా లైసెన్స్, వాహన పత్రాలు కలిగి ఉండాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని తెలిపారు. రోడ్డు నిబంధనలు పాటించడం వల్ల అటు డ్రైవర్లకే కాకుండా, ఇటు ప్రయాణికులకు కూడా రక్షణ ఉంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ తమ్మడపల్లి కుమార్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో రవాణాకు ఆటోలే ప్రధాన ఆధారమని, డ్రైవర్లు అప్రమత్తంగా ఉండి ప్రమాద రహిత సమాజానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథి పెనుగుర్తి గ్రామ సర్పంచ్ తమ్మడపల్లి కుమార్, వార్డు మెంబర్ గుజ్జునూరు శ్రీకాంత్,ఆటో యూనియన్ నాయకులు, డ్రైవర్లు, దేవులపల్లి వెంకన్న, లింగాల శ్రీను, యాకయ్య, లక్ష్మయ్య, సలీం, ప్రవీణ్, ఉప్పలయ్య, రాజు, గ్రామ ప్రజలు రాజేందర్ రెడ్డి, మంకాళి సలీం, తిరుపతి రెడ్డి, డాక్టర్ వెంకటేశ్వర్లు, నాగేల్లి రాములు, జానీ,మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *