
నల్లబెల్లిలో భూకబ్జాల సంస్కృతి తెచ్చింది మీరే
ప్రభుత్వ భూములను కాపాడే పోరాటంలో చిత్తశుద్ధి నిరూపించుకోండి
బిఆర్ఎస్ నేతలపై మండల కాంగ్రెస్ అధ్యక్షులు తిరుపతి రెడ్డి ధ్వజం
గత పదేళ్లలో నల్లబెల్లి మండలంలో భూకబ్జాల సంస్కృతిని పెంచి పోషించిన బిఆర్ఎస్ నాయకులు, నేడు పత్రికా సమావేశాల్లో నీతులు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది అని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిట్యాల తిరుపతి రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకే పరిమితమైన నయీం నేర సామ్రాజ్య సంసృతిని నల్లబెల్లి మండలానికి పరిచయం చేసిన నీచ చరిత్ర బిఆర్ఎస్ నాయకులదని దుయ్యబట్టారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు పరిమితమైన భూ కబ్జాలను కుగ్రామాలకు సైతం విస్తరించిన ఘనత వారిదేనని ఎద్దేవా చేశారు.. అధికారులను భయభ్రాంతులకు గురిచేసి, రికార్డులు తారుమారు చేసి ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారని ఆరోపించారు.ప్రభుత్వ ఆస్తులను కాపాడి ప్రజా ప్రయోజనాలకు వాడాలని కాంగ్రెస్ పోరాడుతుంటే, సామాన్యులను ముంచిన దొంగలను కాపాడేందుకు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
నాయకత్వంలోని బిఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నించడం సిగ్గుచేటు అని తిరుపతి రెడ్డి మండిపడ్డారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఇప్పటికైనా భూ కబ్జాదారుల పక్షాన ఉంటారా లేక ప్రభుత్వ ఆస్తులను కాపాడతారా అన్నది స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ? అమాయక ప్రజలకు ఎస్సారెస్పీ భూములను విక్రయించిన దొంగలకు శిక్ష పడేలా చొరవ తీసుకోవాలని కోరారు. తాము పోరాట నాయకులం అని చెప్పుకునే వారు, నల్లబెల్లిలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను విముక్తి చేసే పోరాటంలో అండగా నిలిచి తమ చిత్తశుద్ధిని, పోరాట నైపుణ్యాన్ని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాలోతు ప్రతాప్ సింగ్, మాలోతు చరణ్ సింగ్, దుంపల ఇంద్రారెడ్డి, పెంతల కొమురా రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు బత్తిని మహేష్ వార్డు సభ్యులు మాసంపెల్లి అఖిల్, మామిడి వేణు, బత్తిని మల్లయ్య, త్యాగరాజు, కోల లింగయ్య, వైనాల సారయ్య, కొండి అశోక్, కన్నెబొయిన సురేష్, కోడూరి సిద్దు, పొడిటి పవన్, బ్రహ్మ తేజ, బాబు రావు, రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.