గ్రామ అభివృద్ధి ప్రతి ఒక్కరి బాధ్యత..
కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్
పీపుల్స్ డైరీ నల్లబెల్లి
నల్లబెల్లి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలంటే గ్రామ ప్రజలంతా రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా పనిచేయాలని నల్లబెల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ పిలుపునిచ్చారు. గ్రామ సంక్షేమమే లక్ష్యంగా సమిష్టి కృషి సాగాలని ఆయన అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎస్సార్ ఎస్పి, భూముల ఆక్రమణ సమస్య గ్రామంలో తీవ్రంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్పందించి, అక్రమ కబ్జాలకు అడ్డుకట్ట వేయడానికి చొరవ చూపాలని కోరారు. ప్రభుత్వ భూములు పరిరక్షించబడితేనే భవిష్యత్ తరాలకు న్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. నల్లబెల్లి గ్రామం మాజీ ఎమ్మెల్యే సొంత గ్రామం కావడంతో, గ్రామ అభివృద్ధి పనుల్లో ఆయన సహకారం మరింత అవసరమని బత్తిని మహేష్ అన్నారు. రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, విద్య, వైద్యం, రైతు సంక్షేమం వంటి మౌలిక వసతుల అభివృద్ధికి అందరూ కలిసి కృషి చేయాలని సూచించారు. గ్రామ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల విషయంలో పార్టీలు, వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనపెట్టి ప్రజాహితమే ప్రథమ లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు కలిసి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. నల్లబెల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసర మని, గ్రామ ప్రయోజనాల కోసం సమిష్టి పోరాటం కొనసాగుతుం దని,వెల్లడించారు.
