- సమ్మక్క సారలమ్మ జాతర పేరు పై ఎవరి పెత్తనం వారిది
- కాంట్రాక్టు పేరుతో నాసిరకం పనులు మొరం దందా
- గుట్టకు ఉన్న మొరాన్ని తవ్వి రోడ్డుకు ఇరువైపులా చదును
- కోడి,మందు కొబ్బరికాయ ఏర్పాటుకు అక్రమ వసూళ్లు
- పీకలు అమ్ముకునే దగ్గర నుండి గాజుల వ్యాపారాల వరకు
- జాతర పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న కార్యవర్గం
- దేవాదాయ శాఖ కనుసన్నల్లో అక్రమాలు జరుగుతున్నా పట్టించుకోని వైనం
- నీరసంగా,నిట్టూర్పు గా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ పనులు
- దాతల సహాయ సహకారాలు లెక్కలు చూపని కార్యవర్గం
- దండిగా ఆదాయం అభివృద్ధి మాత్రం శూన్యం
- ప్రజా ప్రతినిధుల ఆహ్వానానికి దుబారా ఖర్చులు
- గ్రామస్తులు, కమిటీ మధ్య జాతర స్థల వివాదం
- వర్ధన్న పేట ఎమ్మెల్యే దృష్టి సారించాలని భక్తుల వేడుకోలు
పీపుల్స్ డైరీ ప్రతినిధి – వరంగల్
సమ్మక్క సారలమ్మ జాతర సమీపిస్తున్న సమయంలో జాతర గద్దెల ప్రాంగణంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని, జాతర సమయానికి పనులన్నీ పూర్తి స్థాయిలో జరుగుతాయని ప్రజలు భక్తులు ఆశతో ఒక్కరోజు అమ్మవార్ల సన్నిధిలో మొక్కలు అప్పగించి ఆనందంగా గడుపుదామని బయలుదేరుతారు కానీ ఇక్కడ అలా కాదు భక్తుల దర్శనాలు పక్కన పెడితే జాతర ముగిసే సమయానికి ఆదాయం ఎంత వరకు సమకూరుతుంది మీకెంత మాకెంత అంటూ గొడవలే తప్ప అభివృద్ధి కి మాత్రం నోచుకోలేక పోతుంది అర్ద శతాబ్దం నుండి జరుగుతున్న జాతరకు అడుగడుగునా అవమానాలే దిక్కు అయ్యాయి. ఇక వివరాల్లోకి వెళితే నగరానికి అతి సమీపంలో ఉన్న దామెర గుట్టల్లో ఉన్న అమ్మవారి పేట సమ్మక్క సారలమ్మ జాతరకు రెండేండ్లకోసారి దాదాపు ఐదు లక్షల మంది భక్తులు దర్శనానికి వస్తారు అలా మరింత పెరుగుతూనే ఉన్నారు ఇక ఇదే అదునుగా తీసుకున్న కార్యవర్గం దోపిడే లక్ష్యంగా జాతర పేరుతో అక్రమ వసూళ్లు అటు దాతల నుండి ఇటు చిరు వ్యాపారుల వరకు ఒక్కొక్కరి వద్ద 2 వేల మొదలు 5 నుండి 40 వేళ వరకు షెడ్డుకింత అమ్మకాలను వ్యాపారాన్ని బట్టి రేటు నిర్ణయించి రసీదు లేకుండా చిరు వ్యాపారుల వద్ద అక్రమంగా దోపిడీకి పాల్పడుతూ లెక్కల్లో చూపెట్టకుండా నొక్కేస్తున్నారనే వాదన బాహాటంగానే వినవస్తున్నాయి జాతర ఉద్దేశించి ప్రజా ప్రతినిధుల ఆహ్వానానికి దుబారా ఖర్చులు లెక్కల్లో చూపెడుతూ లక్కులో పడుతున్నారు ఇలా ఆదాయం దండిగా ఉన్నప్పటికీ అభివృద్ధికి మాత్రం అమ్మవారి పేట జాతర నోచుకోకపోవటం చోద్యంగానే ఉంది ఇలా దోచుకున్నదీ ఓ వైపైతే దేవాదాయ శాఖ అధికారులు మాత్రం లెక్కా పత్రం లేకుండా కార్యవర్గ చెప్పు చేతుల్లో ఆడిందే ఆట పాడిందే పాటగా వ్యవహరిస్తున్నారు ఇక బల్దియా కాంట్రాక్టు మాత్రం చెప్పనే కూడదు 6 లక్షలు కేటాయిస్తే అందులో రిటైలింగ్ వెల్డింగ్ రంగులు మొరం పనులకు కేటాయిస్తే గుట్టకు ఉన్న మట్టిని రోడ్డుకు ఇరువైపులా నింపుతూ చదును చేస్తున్నారు ప్రైవేట్ స్థలంలో మట్టిని తవ్వకాలు జరుపుతుంటే ఎందుకు తవ్వకాలు చేస్తున్నారని ప్రశ్నించగా సమయం లేదంటూ కాంట్రాక్టర్ ధబాయిస్తూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారని భూ యజమాని వాపోయాడు ఇక పీకలు అమ్ముకునే దగ్గర నుండి పీకలదాకా తాగే మద్యం దుకాణం వరకు గాజుల వ్యాపారుల నుండి చెక్కర గుళికలు అమ్మకం దారులు వరకు పైసా ఇవ్వనిదే పాగా వేయటానికి వీలు లేదన్నట్టు వ్యవహరిస్తున్నారని వాదనలు వెలువడుతున్నాయి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ నుండి ఎంత వరకు బడ్జెట్ విడుదల అయింది దాతలు ఇచ్చిన విరాళాలు హుండీ లెక్కింపులో వచ్చిన ఆదాయం ఇక చిరు వ్యాపారుల వద్ద అద్దెకు ఇచ్చిన స్థలాలకు సంబంధించిన లెక్కలు పూర్తి వివరాలు గోప్యంగా కాకుండా రసీదులు ఇస్తూ వచ్చిన ఆదాయాన్ని సక్రమంగా జాతర అభివృద్ధికి కేటాయిస్తే చుట్టూ పక్కన ప్రాంతమంతా కూడా అభివృద్ధికి తోడ్పడిన వాళ్లవుతారని ప్రాంత ప్రజలు అమ్మవారి పేట సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులు గ్రామ ప్రజలు కార్యవర్గ సభ్యులను వేడుకుంటున్నారు
జాతర పై వర్ధన్నపేట ఎమ్మెల్యే దృష్టి
అమ్మవారి పేట సమ్మక్క సారలమ్మ జాతర లో జరిగే అవకతవకలపై అటు గుత్తేదారు పై ఇటూ కార్యవర్గం పై దృష్టి సారించినట్టు తెలిసింది గత సంవత్సరం జరిగిన జాతర లో పొరపాట్లు ప్రస్తుతం జరగకుండా చూస్తున్నట్టు హుండీ లెక్కింపులో పారదర్శకత పేదల వద్ద చిరు వ్యాపారుల వద్ద అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారి పై వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు కి కొంత మంది పిర్యాదులు చేసినట్టు తెల్సింది వారిపై చర్యలు తీసుకుంటారా దేవాదాయశాఖ,బల్దియా అధికారులు జాతర పనుల్లో జాప్యం చేస్తున్నట్టు ఎమ్మెల్యే దృష్టి వెళ్ళినట్టు తెల్సింది ఇలాంటి వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాల్సిందే.







