బీజేపీకి ఆరూరి రాజీనామా..!
బీఆర్ఎస్లో చేరే ఛాన్స్
పీపుల్స్ డైరీ, వరంగల్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ తాజాగా బీజేపీకి రాజీనామా చేశారు. మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆయన తిరిగి సొంత కూటికి చేరనున్నట్లు సమాచారం. బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో వర్ధన్నపేట నియోజకవర్గ రాజకీయాల్లో చర్చ మొదలైంది.
