మున్సిపల్ ఎన్నికలు.. 4 గంటలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. నేడు సాయంత్రం 3:45 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రెస్‌మీట్ నిర్వహించి ఎన్నికల షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించనుంది. అంతకు ముందు మధ్యాహ్నం 3 గంటలకు ఉన్నత స్థాయి అధికారులతో సమావేశం, ఆపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు మార్చి నెల నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో ఎన్నికల సంగం ప్రధాన కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో రాణి కుముదిని ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. సీఎస్, డీజీపీతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాగా, ఒకే విడతలో మున్సిపల్ ఎన్నికలను పూర్తి చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. ఈ క్రమంలోనే మార్చి 15వ తేదీ లోపు ఎన్నికల ప్రక్రియను ముగించేలా ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ఖరారు చేసినట్లు తెలిసింది.
ఇప్పటికే మున్సిపాల్టీల వారీగా, చైర్మన్, కౌన్సిలర్ స్థానాలకు రిజర్వేషన్ల ప్రక్రియను సైతం ప్రభుత్వం పూర్తిచేసింది. ఎన్నికల సంఘం కూడా ముందస్తు ఏర్పాట్లపై ఇప్పటికే అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేసింది