సమ్మక్క సారలమ్మని దర్శించుకున్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

నల్లబెల్లి మండలం నాగరాజుపల్లి శివారులో వైభవంగా జరుగుతున్న మద్ది మేడారం శ్రీ మేడారం సమ్మక్క-సారలమ్మలను నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దర్శించుకున్నారు. మద్ది మేడారం సమ్మక్క, సారలమ్మ దర్శనానికి గురువారం ఎమ్మెల్యే నర్సంపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో తరలి వెళ్లారు. గద్దె పై కొలువుతీరిన అమ్మవార్లకు ఎమ్మెల్యే మొక్కలను చెల్లించుకున్నారు. మొదట సమ్మక్కఅమ్మ వారిని దర్శించుకుని అనంతరం సారలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడే కొలువై ఉన్న గోవిందరాజు, పడిగిద్ద రాజును ఎమ్మెల్యే దర్శించుకొని మొక్కలు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు ఎమ్మెల్యే చీర, సారెను సమర్పించారు.వనదేవతల గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన, భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం జాతర ప్రాంగణంలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, తాగునీరు మరియు క్యూలైన్ల నిర్వహణపై నిర్వాహకులతో చర్చించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.అమ్మవార్ల దీవెనలు తెలంగాణ ప్రజలకు, నర్సంపేట నియోజక ప్రజల మీద ఉండాలని ఎమ్మెల్యే కోరారు. హుండీలో కానుకలు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వనదేవతలను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. కోరిన కోరికలు తీరుస్తూ, ప్రజల కష్టాలను నెరవేరుస్తున్న గిరిజన ఆదివాసి దైవం సమ్మక్క సారక్క అని పేర్కొన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్నడు లేనివిధంగా సమ్మక్క సారలమ్మ జాతరాలను ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలకు గురికాకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఎమ్మెల్యే వెంట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *