గార్ల ఒడ్డు సాగునీటి కష్టాలు తీరుస్తా
ఎమ్మెల్యే రాందాస్ నాయక్

ఏన్కూరు, ఫిబ్రవరి 18: పీపుల్స్ డైరీ:
ఏన్కూరు లో లిఫ్ట్ ఏర్పాటుచేసి గార్ల ఒడ్డు కు తాగు సాగునీటి శాశ్వత పరిష్కారం చేస్తానని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ హామీ ఇచ్చారు. ఈ మేరకు బుధవారం సిరిపురం మేజర్ సమీపంలో లిఫ్ట్ నిర్మాణ ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ మినీ లిఫ్ట్ నిర్మాణానికి ప్రతిపాదనలు త్వరగా పంపాలని ఇరిగేషన్ అధికారులు ఆదేశించారు. ఈ లిఫ్ట్ ద్వారా గార్లగొడ్డు ఎర్ర చెరువు, నల్ల చెరువులను నింపి సాగు తాగునీరు సమస్యలలు శాశ్వతంగా పరిష్కారం అవుతాయని తెలిపారు. రాజీవ్ లింకు కెనాల్ ద్వారా ఏన్కూరు చెరువు నింపనున్నట్లు చెప్పారు. ఐటీడీఏ ద్వారా 10 కోట్లతో మంజూరైన రోడ్డును, రాజీవ్ లింక్ కెనాల్ ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ గుగులోత్ లచ్చి రామ్ నాయక్, వైరా మున్సిపల్ వైస్ చైర్మన్ కట్లా సంతోష్,మండల పార్టీ అధ్యక్షుడు స్వర్ణ నరేంద్ర కుమార్,మండల నాయకులు మేడ ధర్మారావు, లాలూ నాయక్, పటాన్ మజీద్ ఖాన్, మాలోతు నరసింహారావు, సైదులు తదితరులు పాల్గొన్నారు