ప్రభుత్వ బడులు ముద్దు…. ప్రైవేటు పాఠశాలలు వద్దు

ప్రభుత్వ బడులు ముద్దు…. ప్రైవేటు పాఠశాలలు వద్దు

ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల హాజరు శాతం పెంచాలని లక్ష్యంతో చార్ బౌలి వరంగల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల బృందం గురువారం చార్ బౌలి వరంగల్ లో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ బడులు ముద్దు, ప్రైవేటు పాఠశాలలు వద్దు అంటూ వినూత్నంగ ఉపాధ్యాయులు బృందం ఇంటింటికి తిరిగి తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలో అందుతున్న మౌలిక వసతులను వారికి ప్రభుత్వం అందిస్తున్న పౌష్టిక ఆహారం గురించి వివరించడంతోపాటు, ఉన్నతమైన విద్య అందిస్తున్న చార్ బౌలి వరంగల్ లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేరాలంటూ బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఉపాధ్యాయులు నిర్వహించిన బడిబాట కార్యక్రమానికి చార్ బౌలి వరంగల్ లో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన కనిపించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న విద్య, తో పాటు పౌష్టికాహారం, ఉదయం అల్పాహారం, సాయంత్రం స్నాక్స్ అందజేయడం జరుగుతుందని, అంతేకాకుండా ఎంతో అనుభవం గల ఉపాధ్యాయులచే విద్య బోధన కొనసాగుతుందని ప్రచారంలో ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు వివరించారు. బడి మానేసి పిల్లలు బడిబాట కార్యక్రమంలో భాగంగా గుర్తించారు, వారికి విద్యా సంవత్సరం నుంచి పాఠశాలలో చేర్పించడానికి తల్లిదండ్రులతో ఒప్పించారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం విద్య విధానం ప చేపడుతున్న పూర్తి సమాచారాన్ని ఫ్లెక్సీలో పొందుపరిచి విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఐదేళ్లు నిండిన ప్రతి ఒక్కరు ప్రభుత్వ పాఠశాలలో ఉండే విధంగా మనబడి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రఫీ ఉపాధ్యాయులు హరి ప్రసాదు, కొమురయ్య, ఉష, ప్రసన్నలక్ష్మి, మాధురి, మాధవి, శ్రీనివాస్, వినయ్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *