*కేసీఆర్ పై రాజకీయ కక్షతతో సిట్…*
– తప్పుడు కేసులతో కెసిఆర్ ను భయపెట్టలేరు…!
– గొప్ప నాయకుడిని అణచివేయలేరు!
– గణపురంలో బీఆర్ఎస్ నాయకుల మండిపాటు…!
– కేసీఆర్‌ను అప్రతిష్టపరచాలని కాంగ్రెస్ కుట్ర
– బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మోతే కరుణాకర్ రెడ్డి
– తప్పుడు విచారణలకు భయం లేదు…!
– ‘సిట్ ఆపేయాలి’ నినాదాలతో రాస్తారోకో…!
– మండల కేంద్రంలో భారీ ధర్నా… రాస్తారోకూ…!
– అధికార దుర్వినియోగాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు…!

*పీపుల్స్ డైరీ, గణపురం:*
‘రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించిన కెసిఆర్‌పై రాజకీయ కక్షతతోనే సిట్ విచారణలు చేపడుతున్నారు. ప్రజల తీర్పుతో రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన నాయకుడిని అప్రతిష్టపరచాలనే ఉద్దేశంతో ఈ చర్యలు!’ అంటూ గణపురం మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు మోతే కరుణాకర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఆదివారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మోతే కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. తెలంగాణ రాష్ట్ర నిర్మాత కేసీఆర్‌పై అక్రమ కేసులు బనాయించాలని చూస్తే సహించేది లేదని, ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సుమారు గంటపాటు సాగిన ఈ ధర్నా వల్ల రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది.
– ‘కెసిఆర్‌పై రాజకీయ వేటు’
ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మోతె కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ… ‘రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో స్వప్న అభివృద్ధి పథంలో నడిపించిన కెసిఆర్‌పై రాజకీయ కక్షతతోనే సిట్ విచారణలు జరుగుతున్నాయి. ప్రజల తీర్పుతో రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన గొప్ప నాయకుడిని అప్రతిష్టపరచాలనే ఉద్దేశంతోనే ఈ చర్యలు,’ అని ఆరోపించారు. తెలంగాణ సాధన కోసం జీవితం అంకితం చేసిన కెసిఆర్‌ను తప్పుడు విచారణలతో భయపెట్టలేరని స్పష్టం చేశారు.
– ‘ప్రజాస్వామ్యంపై దాడి’
ఇది ప్రజాస్వామ్యంపై ఘోర దాడి, ప్రజల తీర్పును అవమానించడమే అని మండల అధ్యక్షుడు ఖండించారు. అధికార దుర్వినియోగంతో రాజకీయ ప్రత్యర్థులను అణచివేయాలని చూస్తే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరని ఘాటైన హెచ్చరిక చేశారు. కెసిఆర్‌పై సిట్ విచారణను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు.కార్యకర్తలు ‘కెసిఆర్‌కు న్యాయం జరుగాలి’, ‘సిట్ విచారణను ఆపేయాలి’ అంటూ నినాదాలు చేస్తూ రాస్తారోకోను ముగించారు. స్థానికులు ట్రాఫిక్ జామ్‌తో ఇబ్బంది పడ్డారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు ఉడుత సాంబయ్య, తోట రాకేష్, కొడారి హైమ ధనంజయ్, మాజీ ఎంపీటీసీ మంద అశోక్ రెడ్డి, సీనియర్ నాయకులు భైరగాని కుమారస్వామి, డాక్టర్ జానయ్య, మార్త శీను, పేరాల దేవేందర్రావు, పెంచాల రవీందర్, పల్లె వేణి, సదయ్య, కేటీఆర్ సేన జిల్లా అధ్యక్షుడు వీసం భరత్, గాజర్ల చింటూ, బొట్ల స్వామి, పాపిరెడ్డి మన్తుర్తి, భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.