దేశ ప్రగతి పథంలో దూసుకెళ్లే అభివృద్ధి బడ్జెట్
మరిపెడ మండల బీజేపీ మాజీ అధ్యక్షులు
బింగి రమేష్ యాదవ్

మరిపెడ :
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్–2026 దేశాన్ని వికసిత భారత్ దిశగా మరింత వేగంగా ముందుకు నడిపించే స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను అందించిందని మరిపెడ మండల మాజీ అధ్యక్షులు బింగి రమేష్ యాదవ్ పేర్కొన్నారు. సందర్భంగా బింగి రమేష్ యాదవ్ మాట్లాడుతూ
ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌లో పేద, మధ్యతరగతి, రైతు, యువత, మహిళలు, పారిశ్రామిక రంగం అన్నింటికీ సమతుల్య ప్రాధాన్యం ఇవ్వడం బీజేపీ ప్రభుత్వ సంకల్పాన్ని చాటిచెప్పిందన్నారు.
ప్రజలపై భారం తగ్గించేలా అవసరమైన మందులు, ఆరోగ్య సేవలకు సంబంధించిన ధరలను తగ్గించడం ద్వారా ‘ఆరోగ్య భారత్’ లక్ష్యానికి బలమైన అడుగు వేయబడిందని తెలిపారు. ఇది సామాన్య ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే నిర్ణయమన్నారు.
దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకైన పారిశ్రామిక రంగం, MSMEలు, స్టార్టప్స్‌కు ఊతమిచ్చే విధంగా నిధుల కేటాయింపులు, అలాగే స్కిల్ డెవలప్మెంట్, నూతన సాంకేతిక విద్య, ఉద్యోగావకాశాల సృష్టిపై ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా యువతకు భవిష్యత్తు భరోసా కల్పించిందన్నారు.
అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అనేక కీలక రంగాల్లో కేంద్రం మద్దతు కొనసాగించడం, మౌలిక వసతులు, రవాణా, పరిశ్రమలు, విద్య రంగాల్లో నిధులు కేటాయించడం రాష్ట్ర పురోగతికి దోహదపడుతుందన్నారు.
మొత్తంగా ఈ బడ్జెట్ రాజకీయ లాభాల కోసం కాకుండా, దేశ దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యంగా రూపొందించిన గ్రోత్ బడ్జెట్ అని, వికసిత భారత్–2047 సంకల్పాన్ని సాకారం చేసే దిశగా మరో మైలురాయిగా నిలుస్తుందని బింగి రమేష్ యాదవ్ పేర్కొన్నారు.