


నల్లబెల్లి మండల కేంద్రంలోని నాగరాజు పల్లె శివారులో జరిగిన శ్రీ మద్ది మేడారం సమ్మక్క సారలమ్మ జాతర హుండీలను ఆలయ ఇన్చార్జి సత్య నారాయణ ఆదివారం, జాతర నిర్వాణ కమిటీ సభ్యులు, ఎండోమెంట్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో లెక్కించారు. హుండీ లెక్కింపులో కరెన్సీ నోట్లు వచ్చాయని తెలిపారు.దేవదాయ శాఖ ఇన్చార్జి సత్యనారాయణ, ట్రస్ట్ చైర్మన్ రాజేష్, ఆలయ పూజారి నాగరాజు, సర్పంచ్ లలిత ఆధ్వర్యంలో 6 హుండీలను లెక్కించగా మొత్తం ₹1,78,173 ఆదాయం సమకూరినట్లు తెలిపారు. గత ఏడాది 1,60,000 ఆదాయం సమకూరగా ఈ ఏడాది ఆదాయం పెరిగినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ ఆలయ పూజారులు నాగరాజు హరిశ్రిష్ణ కార్యక్రమంలో మామిండ్ల వీరయ్య పల్లి గ్రామ సర్పంచ్ ఏడాకుల సరోజన సంపత్ రెడ్డి,నాగరాజుపల్లి సర్పంచ్ ఎరుకల లలిత రఘునా, పంచాయతీ కార్యదర్శి సెక్రటరీ విష్ణు, చిట్యాల ఉపేందర్ రెడ్డి,యూత్ నాయకులు వివిధ తదితరులు పాల్గొన్నారు