తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో కళా జాతర

ఆర్థిక, అక్షరాస్యతపై అవగాహన

మండల పరిధిలోని నల్లబెల్లి రుద్రగూడెం గ్రామంలో టి.జి.బీ బ్యాంక్ సిబ్బంది ఆధ్వర్యంలో రైతులకు ఆర్ధిక అక్షరాస్యత సదస్సు కళాజాత నిర్వహించారు. బ్యాంక్ ద్వారా పొందే ఉపయోగాలు ఈ విధంగా వివరించారు: క్రాప్ లోను తీసుకున్న వారు ఏడాది కాలంలో పునరుద్ధరణ చేయడం వలన 7% వడ్డీ మాత్రమే పడుతుందని మరియు కేంద్ర ప్రభుత్వం నుండి 3%వడ్డీ రాయతి పొందవచ్చు. కావున రైతులు వెంటనే బ్యాంక్ కి వచ్చి రెన్యువల్ చేయగలరన్నారు. లేని యెడల వడ్డీ రాయితీ రాకపోను,అధిక వడ్డీ విధించబడుతుందన్నారు. ఇతర బ్యాంక్ లతో పోల్చితే టి.జి.బి లో ఫిక్సడ్ డిపాజిట్ లపై అధిక వడ్డి(6.45%)పొందవచ్చు. వయోరుద్దులకు 0.50% ఇంకా అధన వడ్డీ వర్తిస్తుంది అన్నారు. బంగారు ఋణాలపై వ్యవసాయ నిమిత్తం రూ.9000/-గ్రాముకి చొప్పున ఋణం పొందవచ్చన్నారు. ప్రధానమంత్రి సురక్ష బీమా ద్వారా (రూ. 20/- తో, 18-70 సం. వారు అర్హులు, రూ. 2లక్షల బీమా), ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా (రూ.436/-తో, 18-50 సం. వారు అర్హులు, రూ. 2లక్షల బీమా),ఎస్.బి.ఐ.జనరల్ (రూ.2000/- తో, 18-65 సం. వారు అర్హులు, రూ.40లక్షల బీమా) మొత్తంగా రూ.44లక్షల ఇన్సూరెన్స్ వార్షికానికి వర్తిస్తుంది. ఆక్సిడెంటల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేవారు ఖచ్చితంగా పోలీస్ పంచనామా పొందు పర్చాలన్నారు. ఎస్.బి.ఐ. లైఫ్ ఇన్సూరెన్స్ మరియు ఎస్.బి.ఐ. జనరల్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చేసుకోవచ్చన్నారు.అటల్ పెన్షన్ యోజన ద్వారా (18-40సం. వారు చేరితే)60 సం. తరువాత రూ.1000/- నుండి రూ. 5000/- వరకు పెన్షన్ పొందవచ్చన్నారు. ఏ.టి.ఎం. కార్డ్, మొబైల్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్ యొక్క ప్రయోజనాలు మరియు ఆన్లైన్లో జరిగే మోసాలు, ఓటిపి నెంబర అపరిచుతులకు తెలుపరాదన్నారు. ఒకవేల సైబర్ మోసానికి గురైతే టోల్ ఫ్రీ నెం. 1930కి వెంటనే సంప్రదించాలి అని సూచించారు. మహిళ సంఘాలను బలోపేతం చేయుటకు, సక్రమంగా కట్టే గ్రూపులకు అధిక లింకేజ్/ఋణం రూ.20 లక్షల వరకు ఇస్తుంది. కావున అన్ని గ్రూప్స్ వాళ్ళు సకాలంలో రుణాలు చెల్లించాలన్నారు. ముద్ర లోన్లు తీసుకున్న వారు సకాలంలో కట్టి అధిక లోన్లు తీసుకోవచ్చు. వ్యాపారం చేసుకునేవారు వాటి అభిరుద్ది కొరకు ఎమ్.ఎస్.ఎమ్.ఇ లోన్స్ సంబందించిన డాకుమెంట్స్ ఇచ్చి తీసుకోగలరు. ఖాతా ఉండి చాలా సంవత్సరాలు వాడని ఖాతాదారులు మీ ఆధార్, పాన్ కార్డ్ లేదా ఇతర సంబంధిత పత్రాలు ఇచ్చి కె.వై.సి చేయించుకొని మీ ఖాతా ను మరల రెగ్యులర్ చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఫీల్ ఆఫీసర్ కిరణ్ మహేందర్ భానుమూర్తి మరియు నల్లబెల్లి సర్పంచ్ నాగెల్లి జ్యోతి-ప్రకాష్ , రుద్రగూడెం సర్పంచ్ సుజాత, వి.ఓ.ఏ.లు సుదర్శన్,లలిత, బ్యాంక్ మిత్రలు సుధాగాని ప్రమోద్,రాజేందర్,రాకేష్ గ్రామ పెద్దలు,గ్రామ రైతులు,మహిళ సంఘాల వారు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *