పాఠశాలను తనిఖీ చేసిన ప్యానల్ ఇన్స్పెక్షన్ బృందం.

నల్లబెల్లి: ప్రభుత్వ పాఠశాలల పనితీరు మరియు అభివృద్ధి కొరకై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్యానెల్ ఇన్స్పెక్షన్ బృందం బుధవారం నల్లబెల్లి మండలంలోని బొల్లోనిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలను తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నోడల్ ఆఫీసర్ గుండు రవి మాట్లాడుతూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు పాఠశాలల పనితీరుపై ప్యానల్ ఇన్స్పెక్షన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా వరంగల్ జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను తనిఖీ చేయడం కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారని వారు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉదయం ప్రార్థన సమావేశం మొదలుకొని పరిసరాల పరిశుభ్రత, టాయిలెట్ ల నిర్వహణ, ఆటలు, లైబ్రరీ నిర్వహణ, ఉపాధ్యాయుల డైరీ, లెస్సన్ ప్లాన్స్, FLN మరియు LIP రిజిస్టర్ లు, మధ్యాహ్న భోజన కార్యక్రమం, ఉపాధ్యాయుల హాజరు లాంటి అంశాలు అన్నింటినీ సమగ్రంగా పరిశీలించడం జరుగునని అన్నారు. ప్యానల్ ఇన్స్పెక్షన్ బృందం బుధవారం బొల్లోనిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో చేపట్టిన తనిఖీల్లో భాగంగా అన్ని అంశాలను పరిశీలించి, అన్ని రిజిస్టర్లు సక్రమంగా ఉన్నాయని సంతృప్తి చెందారు. ఈ కార్యక్రమంలో ప్రాథమికోన్నత స్థాయి పరిశీలన బృందం సభ్యులు కట్కూరి నరసింహులు, మెరుగు రఘుపతి బోల్లోనిపల్లి ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి.శారద మేడం పాఠశాల ఉపాధ్యాయులు ఏ.శేఖర్, ఎమ్.అనూష, కె.అనిత,జె.మంజుల మరియు Crp S లక్ష్మీనర్సయ్య పాల్గొన్నారు