ఆగి ఉన్న ట్రాక్టర్ ను డీ కొట్టిన ఆటో. ఇద్దరికీ తీవ్ర గాయాలు.

ఆగి ఉన్న ట్రాక్టర్ ను డీ కొట్టిన ఆటో. ఇద్దరికీ తీవ్ర గాయాలు.

నల్లబెల్లి మండలంలోని బిలనాయక్ తండా శివారులో సోమవారం నేషనల్ హైవే 365 రహదారిపై ఆగి ఉన్న ట్రాక్టర్ ను ఆటో డీ కొన్నది…రహదారిపై ఆగి ఉన్న ట్రాక్టర్ను ఆటో ఢీకొట్టిన ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను నర్సంపేటలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు .స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బిలనాయక్ తండా శివారు 365వ జాతీయ రహదారిపై నర్సంపేట నుంచి అడవి మల్లంపల్లి వైపునకు వెళ్తున్న ట్రాక్టర్ అకస్మాత్తుగా ఆగింది. దీంతో దాని వెనుక వస్తున్న ఆటో అదుపుతప్పి ట్రాక్టర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.బాధితులు గూడూరు మండలంలోని మట్టేవాడ గ్రామానికి చెందిన తల్లి, కుమారుడు హరిబండి రత్నమాల (50), హరిబండి సునీల్ (30) నర్సంపేట నుండి మల్లంపల్లి కు ఆటోలో వెళ్తున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *