- ప్రజల సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు….!
- పట్టించుకోని తహసిల్దార్
- అధికారుల తీరుపై జనం మండిపాటు
పెద్దకడబూరు (కర్నూలు జిల్లా), ఫిబ్రవరి 21 (పీపుల్స్ డైరీ ) :
మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడబూరు మండలం తాసిల్దార్ కార్యాలయంలో కొంతమంది విధులను నిర్లక్ష్యం చేస్తూ ప్రజా సమస్యలపై పూర్తిగా నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా భూ సంబంధిత సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ భూ సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు తహసీల్దార్ కార్యాలయాలను ఆశ్రయించినా ఎలాంటి స్పందన లేదని బాధితులు వాపోతున్నారు. రోజూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, చివరకు కాళ్లు అరిగే స్థితికి చేరుకున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే తాసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది కూడా తాసిల్దార్ రాకపోవడంతో సమయపాలన పాటించకుండా వారి ఇష్ట రాజ్యాంగ వ్యవహరించడంపై కార్యాలయానికి వచ్చే రైతులు మండిపడ్డారు. దీంతో పరిపాలనా వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం కోల్పోయే పరిస్థితి నెలకొంటోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని, భూ సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని భూ బాధితులు డిమాండ్ చేస్తున్నారు.