*చైర్ పర్సన్ కు సముచిత స్థానం కలిగిన వ్యక్తి లేరు?* 

*చైర్ పర్సన్ కు సముచిత స్థానం కలిగిన వ్యక్తి లేరు?*

 

*సబ్ డివిజన్ పరిధిలో ప్రధాన మున్సిపాలిటీకి అనుభవం కలిగిన చైర్మన్ కావాలి స్థానిక ప్రజల వెల్లడి*

ఆర్మూర్, ఫిబ్రవరి

25 ( పీపుల్స్ డైరీ) నిజమాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ 2026 ఎలక్షన్లలో 36 వార్డులకు ఎన్నికలు జరగ్గా అధికార ప్రతిపక్ష పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కౌన్సిలర్స్ గా ఎన్నుకోబడ్డారు. కేవలం ముగ్గురు అభ్యర్థులు స్వతంత్రంగా బరిలో నిలిచి గెలుపొందారు. ఒకటవ వార్డు కౌన్సిలర్ గా స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. ఓటమిని సహించలేని అధికార పార్టీకి చెందిన రాష్ట్ర అధికార పార్టీ ప్రతినిధి ఏదో ఒక వార్డు అభ్యర్థిని రాజీనామా చేయించాలని ఆ పార్టీ రాజకీయ సీనియర్ నాయకులు తో మంతనాలు చేసి చర్చించుకున్నట్లు విశ్వసనీయ రాజకీయ సమాచారం. పట్టణంలో 15వ వార్డుకు చెందిన ఓ కౌన్సిలర్ కు చైర్ పర్సన్ గా పట్టం కట్టగా ఆ అభ్యర్థికి రాజకీయ రణరంగంతో చక్రం తిప్పనున్నారు. ఎందుకనగా వారికి ఏమాత్రం అర్హత అనుభవం లేకపోవడం అని చెప్పుకొస్తున్నారు. తాను చైర్ పర్సన్ గా మున్సిపల్ పీఠం దక్కించుకునేలా చేసే వినూత్న ప్రయత్నాలు నెరవేరుతాయా..!? ఒక స్వతంత్ర వార్డు అభ్యర్థిని రాజీనామా చేయించి, అవిశ్వాస తీర్మానంతో మళ్లీ ఆ వార్డును కైవసం చేసుకునే ప్రయత్నం కొనసాగుతుంది.. ఆ వార్డు నుండే చివరికి అదే విజయం సాధించేనా? చైర్పర్సన్ పీఠం దక్కించుకునేలా ప్రయత్నం ప్రజల్లో రాజకీయ విశ్లేషణ సమాచారం ద్వారా ఎదురుచూడాల్సిందే!

 

స్వతంత్ర అభ్యర్థులు గెలిచిన వారిలో ఒక వార్డు అభ్యర్థి స్థానంలో చైర్పర్సన్ గా ముందు వరుసలో రాబోయే రోజుల్లో కాబోయే పెద్దన్న ముందు వరుసలో ఉన్నట్లు తెలిసింది. చైర్ పర్సన్ కు అనర్హత వేటు తప్పదని, రాజకీయంలో ఏమాత్రం అనుభవం లేదని, నేరుగా చైర్మన్ అయితే పట్టణ అభివృద్ధి కుంటుపడుతుందని, కొంత వరకు పట్టణంలో రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. కాగా అనుభవం కలిగిన వ్యక్తికి పట్టణాన్ని పట్టం కట్టనున్నట్లు అదే దిశలో పట్టణాన్ని సుందరమయంగా మార్చడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రం నుంచి నేరుగా నిధులు తీసుకురావడానికి సరైన వ్యక్తి పట్టణంలో ఉన్న రాబోయే రోజుల్లో కాబోయే పెద్దన్న ను ఎన్నుకొని పట్టణ అభివృద్ధికి దోహదపడాలని స్థానిక కౌన్సిలర్లు, ప్రజలనుకుంటున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *