
పీపుల్స్ డైరీ – నల్లబెల్లి
బైక్ అదుపు తప్పి యువకుడు మృతి చెందిన ఘటన దుగ్గొండి మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని తొగర్రాయి గ్రామ శివారు మూల మలుపు వద్ద మంగళవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్లబెల్లి మండలం దస్తగిరిపల్లి గ్రామానికి చెందిన పోతరబోయిన మనోహర్ (26) మృతి చెందాడు. గిర్నిబావి వైపు నుంచి దుగ్గొండికి వస్తుండగా బైక్ అదుపు తప్పి ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.విషయం తల్లిదండ్రులకు తెలియజేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దస్తగిరి పల్లెలో యువకుడి మృతి సంఘటనా స్థానికంగా కలకలం సృష్టించాయి.