నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి.
ఏన్కూరు, మార్చ్ 6 (పీపుల్స్ డైరీ)

ఏన్కూరు మండలంలోని పలు శుభ కార్యక్రమాలకు గురువారం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. గంగుల నాచారం లో మాజీ ఎంపీపీ ముక్తి వెంకటేశ్వర్లు కుమారుడు ప్రవీణ్ వివాహానికి హాజరై దంపతులను ఆశీర్వదించారు. అదేవిధంగా తూతక్క లింగన్నపేట గ్రామంలోని మాజీ వైస్ ఎంపీపీ పాశం శ్రీనివాసరావు కుమారుడు సతీష్ వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు బొర్రా రాజశేఖర్, నూతకాని జైపాల్, సొసైటీ మాజీ అధ్యక్షులు శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ గుగులోత్ లచ్చి రామ్ నాయక్, పార్టీ మండల అధ్యక్షుడు స్వర్ణ నరేంద్ర కుమార్, ఏ బ్లాక్ అధ్యక్షులు వేముల కృష్ణ ప్రసాద్, మండల నాయకులు మేడా ధర్మారావు, ప్రభావతి రెడ్డి, వాసిరెడ్డి నాగేశ్వరరావు, కట్టా సత్యనారాయణ, కనిశెట్టి వెంకన్న, నల్లమల శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.