సిసిఆర్టి గౌహతి లో జరిగే శిక్షణా కార్యక్రమం కు ఎంపికైన ఉపాధ్యాయిని సాగి సుజాత:

సిసిఆర్టి గౌహతి లో జరిగే శిక్షణా కార్యక్రమం కు ఎంపికైన ఉపాధ్యాయిని సాగి సుజాత:

ఏన్కూరు, ఫిబ్రవరి 1: పీపుల్స్ డైరీ:
సాంస్కృతిక వనరులు మరియు శిక్షణ కేంద్రం (సి సి ఆర్ టి) న్యూఢిల్లీ వారు గౌహతిలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయ శిక్షణకు ఎంపికైన బురద రాఘవాపురం ఉపాధ్యాయుని సాగి సుజాత. మన రాష్ట్రం నుండి మొత్తం తొమ్మిది మంది గౌహతి, అస్సాం రాష్ట్రంలో జరిగే ఉపాధ్యాయ శిక్షణకు ఎంపికైనారు. వారిలో ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం బురదరాబాపురం ఉన్నత పాఠశాల లో పనిచేస్తున్న సాగి సుజాత జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు ఒకరు.అక్కడ మన సంస్కృతిని, విద్యకు అనుసంధానించడం, విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి సృజనాత్మకంగా బహిర్గత పరచడమే లక్ష్యంగా చేతివృత్తులను ప్రోత్సహించడం కొరకు జాతీయ విద్యా విధానంలో భాగంగా ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పొందిన అవగాహన ఆధారంగా పాఠశాలలో చేతి పనులు, పని అనుభవం యస్ యు పి డబ్ల్యూ బోధనకు పాఠ్యక్రమం రూపొందించడంలో ఉపాధ్యాయులకు మార్గ నిర్దేశం చేయడం, నైతిక విద్య, విలువలు, సామాజిక సేవ, శ్రమ గౌరవం వంటివి విద్యార్థులలో భావనలను కల్పించడం కొరకు, ప్రస్తుత ఆధునిక సమాజంలో కొత్త కొత్త ఆవిష్కరణలను పరిచయం చేయించడం కొరకు ది 04-02-2026 నుండి 13-02-26 వరకు జరిగే సిసిఆర్టి గౌహతిలో జరిగే వృత్యంతర శిక్షణకు వెళుతున్నారు.
శిక్షణకు వెళుతున్న సాగి సుజాతను ఏన్కూరు మండల విద్యాధికారి మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి. నాగిరెడ్డి , ఎ ఎ పీ సీ చైర్మన్ హేమలత, ఏనుకూరు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని శ్రీమతి వాసవి దేవి, ఏనుకూరు బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి లక్ష్మ, బురదరాఘవాపురం ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, గ్రామ పెద్దలు అభినందించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *