జిల్లాలో 9 మంది ఎస్ఐల బదిలీ

జిల్లాలో 9 మంది ఎస్ఐల బదిలీ

*పీపుల్స్ డైరీ, భూపాలపల్లి:*

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 9 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ మంగళవారం రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉత్తర్వులు విడుదల చేశారు. ముగ్గుళ్లపల్లి ఎస్ఐ బి అశోక్‌ను గణపురం ఎస్ఐగా, టేకుమట్ల ఎస్ఐ డి సుధాకర్ రెడ్డిని చిట్యాల ఎస్ఐగా నియమించారు. చిట్యాల ఎస్ఐ జి శ్రావణ్ కుమార్‌ను భూపాలపల్లి సెకండ్ ఎస్ఐగా బదిలీ చేశారు.

గణపురం ఎస్ఐ ఆర్ అశోక్‌ను భూపాలపల్లి వీఆర్‌కు, కొత్తపల్లి గోరి ఎస్ఐ ఎస్ దివ్యను భూపాలపల్లి ఎల్బీ ఎస్ఐగా నియమించారు. అలాగే వీఆర్‌లో ఉన్న ఎస్ఐ సాయి తిలోక్‌ను నాధిరెడ్డికొత్తపల్లికి, ఎస్ఐ పి సతీష్‌ను చిట్యాలకు, ములుగు జిల్లాలో వీఆర్‌లో ఉన్న ఎస్ఐ ఎం సురేష్‌ను ముగ్గుళ్లపల్లి ఎస్ఐగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *