కోటంచలో ‘పీపుల్స్‌డైరీ’ క్యాలెండర్‌, డైరీ ఆవిష్కరణ

కోటంచలో ‘పీపుల్స్‌డైరీ’ క్యాలెండర్‌, డైరీ ఆవిష్కరణ

పీపుల్స్‌డైరీ-వరంగల్‌ : కోటంచ లక్ష్మీనర్సింహాస్వామి ఆలయ సన్నిధిలో ‘పీపుల్స్‌డైరీ’ దినపత్రిక 2026 క్యాలెండర్‌, డైరీలను ఆవిష్కరించారు. పత్రిక ఆధ్వర్యంలో డైరీతో పాటు నూతన సంవత్సర కాలెండర్‌లను ప్రచురించడం జరిగింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని సుప్రసిద్ద కోటంచ ఆలయ ఆవరణలో గురువారం డైరీతో పాటు క్యాలెండర్‌ను ప్రధాన అర్చకులు తూప్రాని బుచ్చమాచార్యులు, తూప్రాని శ్రీనివాసా చార్యులు, ఆలయ చైర్మన్‌ భిక్షపతి, మాజీ చైర్మన్‌ కర్ణాకర్‌ రెడ్డి, ఎన్‌ఎస్‌ఆర్‌ సంస్థల అధినేత సంపత్‌ రావు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు స్వామివారి ఎదుట క్యాలెండర్‌, డైరీలకు పూజలు నిర్వహించి యాజమాన్యానికి ఆశీర్వాదం అందించారు. ఈ కార్యక్రమంలో పీపుల్స్‌డైరీ దినపత్రిక చీఫ్‌ ఎడిటర్‌ కొండపర్తి కిరణ్‌, ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రతినిధి కూచన సంతోష్‌ కుమార్‌, సీనియర్‌ జర్నలిస్ట్‌ గుంటి విద్యాసాగర్‌, పత్రిక శ్రేయోభిలాషులు వినుకొండ శంకరా చారి, బొజ్జ రవీంద్రా చారి తదితరులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు క్యాలెండర్లు అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *